TGCET 2024 Notification: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఈ ప్రక్రియ మొదలు కానుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 2024 విద్యా సంవత్సరంలో ఐదో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ ఈ రోజు సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సొసైటీ కార్యదర్శి, వీటీజీ సెట్ కన్వీనర్ నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో వెల్లడించారు. 2023-24 విద్యా సంవత్సరంలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. ఈ రోజు నుంచి జనవరి 6వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని, ఫిబ్రవరి 11న రాత పరీక్ష నిర్వహించి మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామని నవీన్ నికోలస్ తెలిపారు.
జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధిత జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి. విద్యార్ధుల వయసుకు సంబంధించి ఓసీ, బీసీ, బీసీ విద్యార్థులు 9 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్ధుల తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతంలో రూ.1.50,000, పట్టణ ప్రాంతంలో రూ.2,00,000 మించకుండా ఉండాలి. ఏమైనా సందేహాలు ఉంటే వివరాలకు 1800 425 45678 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించండి.
Also Read: BJP : బిజెపి సోషల్ ఇంజనీరింగ్