Site icon HashtagU Telugu

Ration Cards : రేషన్​ కార్డుల్లో తప్పుల సవరణకు అప్లై చేయడం ఇలా..

Ration Cards update 2025

Ration Cards : కొంతమంది రేషన్ కార్డుల్లో తప్పులు ఉంటాయి.  కొందరి పేర్లలో మిస్టేక్స్ ఉంటాయి. కొత్తగా పెళ్లయిన వారు తమ జీవిత భాగస్వామి పేరును రేషన్ కార్డులో(Ration Cards) చేర్చాల్సి ఉంటుంది. ఇంకొందరు తమ పిల్లల పేర్లను రేషన్ కార్డుల్లో చేర్చాల్సి ఉంటుంది. మరికొందరు ఇంటి అడ్రస్‌ను మార్చాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయడం ఇక ఈజీ. కొన్ని డాక్యుమెంట్స్ రెడీగా ఉంటే ఆన్‌లైన్‌లో మీరే ఫోను నుంచి అప్లికేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయొచ్చు.

We’re now on WhatsApp. Click to Join

ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ ప్రతులను మీరు స్కాన్ చేయించి, వాటి  డిజిటల్ కాపీలను మీ ఫోనులోకి తీసుకోవాలి. ఒక సెట్ జిరాక్స్ ప్రతులు కూడా తీసి ఉంచుకోవాలి.  గూగుల్‌లో Telangana Mee seva Portal అనే వెబ్ సైట్ ఉంటుంది. అది ఓపెన్ చేయగానే వచ్చే హోం పేజీలో Services అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే.. ఓపెన్ అయిన పేజీలో Search for Services అనే బటన్ వస్తుంది. దానిపై  క్లిక్​ చేయాలి. తదుపరిగా Department అనే ఆప్షన్ వస్తుంది. దాని​లోకి వెళ్లి Selectపై క్లిక్ చేసి Civil Supplies అనే ఆప్షన్​ను క్లిక్ చేశాక ఓపెన్ అయిన పేజీలో ‘Corrections in Food Security Card’ అనే ఆప్షన్ వస్తుంది.

Also Read :Porn Passport : మైనర్లు అశ్లీల కంటెంట్‌ చూడకుండా అడ్డుకునే ‘పాస్‌పోర్ట్’

దానిపై క్లిక్ చేశాక తెరుచుకునే పేజీలో కుడి వైపున Download Application Form అనే ఆప్షన్  కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే దరఖాస్తు పత్రం డౌన్​లోడ్ అవుతుంది. డౌన్ లోడ్ అయ్యాక ఆ దరఖాస్తు పత్రాన్ని ప్రింట్ తీసుకోవాలి. ఆ ఫామ్‌పై Address Change/ Member Details Modifications/ Member Addition అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో మీకు ఏది అవసరమో.. దానిపై రైట్ టిక్ చేయాలి.  దరఖాస్తు ఫాంను నింపేసి..  ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ ప్రతులను దానికి యాడ్ చేసి  సమీపంలోని మీసేవా కేంద్రంలో సమర్పించాలి. ఒకవేళ ఇదంతా చేయడం ఎందుకని భావిస్తే.. ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ ప్రతులను తీసుకొని మీరు నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్లొచ్చు. మనం అప్లై చేశాక అధికారులు వెరిఫికేషన్ చేస్తారు. ఆ తర్వాత మీరు కోరిన మార్పులతో రేషన్ కార్డు జారీ అవుతుంది.

Also Read :Bandi Sanjay : 26 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు : బండి సంజయ్