హైదరాబాద్ (Hyderabad) నగరంలో సొంత ఇల్లు (House) కొని నివసించాలనేది ప్రతి మధ్యతరగతి కుటుంబం కల. కానీ గతకొంత కాలంగా నగరంలోని ఫ్లాట్ ధరలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఐటీ ప్రాంతాల్లో 2 BHK అపార్ట్‌మెంట్ (Apartment ) కొనాలంటే కనీసం 60 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అయితే తాజాగా అందుబాటులో ఉండే రేట్లకు కొన్ని ప్రాంతాల్లో 50 లక్షల లోపు అపార్ట్‌మెంట్లు లభ్యమవుతున్నాయి. ఇది మధ్యతరగతి ప్రజలకు మంచి అవకాశంగా మారింది.
PM Modi : కాసేపట్లో భారత్ – పాక్ డీజీఎంఓల చర్చలు.. ప్రధాని మోడీ నివాసంలో కీలక భేటీ
హైదరాబాద్ శివార్లలోని అప్పా జంక్షన్‌ను దాటి కొన్ని ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ విస్తరిస్తోంది. ఇక్కడ 1000-1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న 2BHK అపార్ట్‌మెంట్లు 40-50 లక్షల మధ్య లభిస్తున్నాయి. కొంపల్లి, చందానగర్-అమీన్‌పూర్ మార్గంలో కూడా ఇలాంటి అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. అలాగే ఉప్పల్, నాగోల్ వంటి కొన్ని ప్రాంతాల్లోనూ 45-50 లక్షల మధ్య 2BHK అపార్ట్‌మెంట్లు లభ్యమవుతున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్‌కు కాస్త దూరంగా ఉన్న షాద్‌నగర్ వంటి ప్రాంతాల్లో అయితే ఇంకా తక్కువ ధరకే ఫ్లాట్లు లభిస్తున్నాయి. అక్కడ 2BHK అపార్ట్‌మెంట్లు 35-50 లక్షల మధ్య దొరుకుతున్నాయి. చిన్న బిల్డర్లు నిర్మించే ఇల్లు కావడంతో ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండానే ఎంఆర్పీ ధరకు పొందవచ్చు. అయితే బిల్డర్లు రిజిస్ట్రేషన్, మెయింటెనెన్స్ వంటి ఇతర ఛార్జీలు వేసి మొత్తం ఖర్చును 10 లక్షల వరకు పెంచుతున్నారు. కనుక ఇల్లు కొనాలనుకునే వారు ముందుగా ఏరియాలు పరిశీలించి, బడ్జెట్‌కు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటే కలల ఇంటిని సాకారం చేసుకోవచ్చు.