Site icon HashtagU Telugu

My Ticket App: టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే.. మీ టికెట్‌ యాప్ ప్రారంభం!

My Ticket App

My Ticket App

My Ticket App: ‘మీ టికెట్’ యాప్‌ను (My Ticket App) తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘అన్నిరకాల టికెట్ బుకింగ్స్‌ను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తెచ్చేందుకు వీలుగా యాప్‌ను రూపొందించాం. రాబోయే రోజుల్లో ఇలాంటి యాప్‌లను మరిన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. ఇందులో రాష్ట్రంలోని 15 దేవాలయాలు, 129 పార్కులు, 54 బోటింగ్ ప్రదేశాలు, జూ, మెట్రో, ఆర్టీసీ, మ్యూజియాలు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్స్‌కు సంబంధించిన టికెట్లను తీసుకోవచ్చు’’ అని వివరించారు.

ఆర్టీసీ, మెట్రో టికెట్లు, దేవాలయాల్లో దర్శనం, ఇతర సేవలకు సంబంధించిన టికెట్లు, పార్కులు, ఇతర పర్యాటక స్థలాల్లో క్యూలైన్లలో నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ఎంట్రీ టికెట్లను ఒకే ఒక్క క్లిక్ తో మీసేవ రూపొందించిన టికెట్ యాప్ లో బుక్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. టెక్నాలజీ సాయంతో పౌర సేవలను ప్రజల ముంగిటకు చేరవేస్తున్నామ‌న్నారు. అన్ని రకాల టికెట్ బుకింగ్స్‌ను ఒకే ప్లాట్ ఫాంపైకి తెచ్చేందుకు వీలుగా ఈ యాప్ ను రూపొందించిన‌ట్లు మంత్రి మ‌రోసారి స్ఫ‌ష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఇలాంటి తరహా యాప్ లను మరిన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు త‌న‌తో పాటు ప్రభుత్వం కృషి చేస్తుంద‌న్నారు.

Also Read: Tirupati Stampede Incident : తొక్కిసలాట ఘటనలో ఆ ఇద్దర్ని సస్పెండ్ చేసిన సీఎం

ఈ యాప్ లో తెలంగాణలోని 15 ప్రముఖ దేవాలయాలు, 129 పార్కులు, 54 బోటింగ్ ప్రదేశాలు, జూ, మెట్రో, ఆర్టీసీ, మ్యూజియాలు, ప్లే అండ్ ఎంటర్ టైన్ మెంట్ జోన్స్ కు సంబంధించిన టికెట్లను తీసుకోవచ్చన్నారు. వీటితోపాటు జీహెచ్ఎంసీ పరిధిలోని కమ్యూనిటీ హాళ్లు, జిమ్ లు, స్పోర్ట్ కాంప్లెక్స్ లను బుకింగ్ సౌకర్యం కూడా ఉండ‌నుందని.. మీరు ఎంచుకున్న లొకేషన్ కు సమీప ప్రాంతాల్లోని చూడదగిన ప్రదేశాలుంటే.. ఆ సమాచారం కూడా యాప్ లో ఆటోమేటిక్ గా కనిపిస్తుందని మంత్రి తెలిపారు. అయితే ఇందులో టికెట్ల‌ను యూపీఐ ద్వారా చెల్లింపులు చేసి టకెట్ తీసుకోవ‌చ్చు. ఇతర ప్లాట్ ఫాంల మాదిరిగా ఈ యాప్ లో అదనంగా ఎలాంటి ఛార్జీలను వసూలు చేయ‌రని మంత్రి తెలిపారు.

 

Exit mobile version