Site icon HashtagU Telugu

TET Fee : ‘టెట్’ ఫీజులు తగ్గించే యోచనలో ప్రభుత్వం ?

TS TET 2023

Tet Notification

TET Fee :  తెలంగాణలో టెట్ అభ్యర్థులు లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటున్నారు.  గతంలో టెట్ ఒక పేపర్‌కు పరీక్ష ఫీజు  రూ.200 ఉండగా.. ఇప్పుడు దాన్ని రూ.1000కి పెంచారు. టెట్ ఎగ్జామ్‌ను రెండు పేపర్లకు రాస్తే గతంలో ఫీజు రూ.300 ఉండేది. ఇప్పుడు దాన్ని ఏకంగా రూ.2,000కు పెంచేశారు. టెట్ పరీక్ష ఫీజుల పెంపుపై నిరుద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.  టెట్ ఫీజుల పెంపు వ్యవహారం తాజాగా  సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లింది. ఫీజుల పెంపు అధికారుల స్థాయిలోనే జరిగిందని సీఎంవో వర్గాలు సీఎంకు వివరించాయి. దీంతో సమస్య తీవ్రతరం కాకముందే ఫీజును తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేస్తారని అంటున్నారు. కోచింగ్, హాస్టల్ ఫీజులకే వేల రూపాయలు ఖర్చుపెడుతున్న తమకు పెరిగిన పరీక్ష ఫీజులు అదనపు భారంగా మారాయని టెట్ అభ్యర్థులు(TET Fee) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

Also Read : WhatsApp lock: వాట్సాప్ లాక్ ఇకపై మరింత ఈజీ.. థర్డ్ పార్టీ యాప్స్ కి బై చెప్పండి?

Also Read :Geethanjali Malli Vacchindi : రాజకీయాలను సినిమాలకు ముడి పెట్టొద్దు.. ఎంతమంది అడ్డు పడినా సినిమా రిలీజ్ చేస్తాం..!