Site icon HashtagU Telugu

HYD Tourist Place : హైదరాబాద్‌లో మరో టూరిస్టు ప్లేస్

Hyd Tank Bund

Hyd Tank Bund

హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఎన్నో చూడదగ్గ ప్రదేశాలు (Tourist Places) ఉండగా..ఇప్పుడు మరొకటి జత కాబోతుంది. హుస్సేన్ సాగర్ (Hussain Sagar) ఒడ్డున కొత్త సెక్రటేరియట్, ఎన్టీఆర్ గార్డెన్, నెక్లెస్‌రోడ్డు, సంజీవయ్యపార్కు, లుంబినీపార్కు, అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం, తెలంగాణ అమరవీరుల జ్జాపకార్థం నిర్మించిన అమర జోత్యి, కొత్త సెక్రటేరియట్ టూరిస్టులను ఇప్పటికే ఎంతగానో ఆకర్షిస్తుండగా.. ఇప్పుడు సాగర్ చుట్టూ మరో కీలక టారిస్ట్ స్పాట్ నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తులు మొదలుపెడుతుంది. తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి తాజా ఆదేశాల ప్రకారం.. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించి వాటిని కొత్త టూరిజం పాలసీలో చేర్చాలి అని నిర్ణయం తీసుకున్నారు. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ పరిసరాల్లో స్కైవాక్ ప్రాజెక్టు(Skywalk Project)ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలనీ ఆదేశాలు జారీ చేసారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా గేమింగ్ జోన్లు, ఫుడ్‌కోర్టులు, ఓపెన్ థియేటర్లు, మినీ థియేటర్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Dhar Robbery Gang : తెలుగు రాష్ట్రాల్లో ‘ధార్‌’ దొంగలు.. ఈ ముఠా చిట్టా ఇదీ

ఈ స్కైవాక్ ప్రాజెక్టు మొత్తం 10 కిలోమీటర్ల పొడవునా నిర్మించనున్నారు. టూరిస్టులు ఈ స్కైవాక్‌ను వాకింగ్, సైక్లింగ్, మార్నింగ్ వాక్ కోసం వినియోగించుకోవచ్చు. ఆరు మీటర్ల వెడల్పుతో నిర్మించే ఈ మార్గంలో వేరువేరు సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ లను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ నగరాన్ని మరింత పర్యాటక ప్రదేశంగా మార్చే లక్ష్యంతో, ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ టూరిజం పాలసీ 2025 లో భాగంగా టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హెల్త్ టూరిజం ప్రాజెక్టులను కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు హుస్సేన్ సాగర్ చుట్టూ నిర్మించనున్న స్కైవాక్ ద్వారా పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రత్యేక టికెట్ విధానం ద్వారా ఆదాయాన్ని కూడా సమకూర్చేలా తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ స్కైవాక్ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్ నగరానికి మరింత గ్లోబల్ గుర్తింపు రానుంది. పర్యాటకులు, నగర వాసులు హుస్సేన్ సాగర్ అందాలను మరింత దగ్గరగా ఆస్వాదించే అవకాశం పొందనున్నారు.

Exit mobile version