3rd Death – A Week : వారంలో మూడో మరణం.. అమెరికాలో ఆగని భారత విద్యార్థుల మరణాలు

3rd Death - A Week : ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికాకు వెళ్లిన విద్యార్థుల వరుస మరణాలు కలకలం క్రియేట్ చేస్తున్నాయి.

  • Written By:
  • Updated On - February 2, 2024 / 07:46 AM IST

3rd Death – A Week : ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికాకు వెళ్లిన విద్యార్థుల వరుస మరణాలు కలకలం క్రియేట్ చేస్తున్నాయి. అమెరికా గడ్డపై వారం వ్యవధిలోనే మూడో భారత విద్యార్థి(3rd Death – A Week) మృతిచెందడం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. అమెరికాలో భారతీయ స్టూడెంట్స్ భద్రతను ప్రశ్నార్ధకంగా మారుస్తోంది. తాజాగా అమెరికాలోని సిన్సినాటిలో మరో తెలుగు విద్యార్థి శ్రేయాస్‌రెడ్డి బెనిగెరి  శవమై కనిపించాడు. ఆయన ఎలా మరణించారు ? అసలేం జరిగింది ? అనే వివరాలు ఇంకా బయటికి రాలేదు. ఈ వివరాలు బయటికి రావడంతో  శ్రేయాస్ రెడ్డి కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఒహియోలోని సిన్సినాటిలో శ్రేయాస్‌రెడ్డి బెనిగెరి చనిపోయి కనిపించాడు. లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో శ్రేయాస్ చదువుతున్నట్టు తెలుస్తోంది. అతడి మృతిపై న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రగాఢ సంతాపం తెలిపింది. బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందిస్తామని వెల్లడించింది. ఈ వారంలోనే వివేక్ సైనీ, నీల్ ఆచార్య అనే మరో ఇద్దరు భారతీయ విద్యార్థులు కూడా మరణించారు. వివేక్ సైనీని ఓ స్థానికుడు హత్య చేయగా.. నీల్ ఆచార్య అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు.

We’re now on WhatsApp. Click to Join

వివేక్ సైనీ

హర్యానాకు చెందిన వివేక్ సైనీ (25) ఉన్నత విద్య కోసం అమెరికాలోని జార్జియాకు వెళ్లాడు. అతడు ఎంబీఏ చేస్తూనే.. ఓ దుకాణంలో జాబ్ చేసేవాడు.  స్థానికంగా ఇల్లు లేని ఒక వ్యక్తికి ఆ దుకాణంలో షాపు నిర్వాహకులు ఆశ్రయం కల్పించారు. షాపు నుంచి వెళ్లిపోవాలని ఆ వ్యక్తికి వివేక్ సూచించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన అతగాడు సుత్తెతో వివేక్ సైనీ తలపై 50 సార్లు బాది దారుణంగా మర్డర్ చేశాడు. ఈ హత్యకు పాల్పడిన వ్యక్తి పేరు జూలియన్ ఫాల్క్‌నర్ అని.. అతడు డ్రగ్స్‌కు బానిస అని విచారణలో తేలింది.

నీల్ ఆచార్య

ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థి నీల్ ఆచార్య గత వారం రోజుల క్రితం శవమై కనిపించాడు. జాన్ మార్టిన్సన్ హానర్స్ కాలేజ్ ఆఫ్ పర్డ్యూ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాడు ఆచార్య. కాగా గత ఆదివారం ఆచార్య కనిపించడం లేదని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరుసటి రోజే ఆచార్య చనిపోయి ఉండటాన్ని గుర్తించారు.

ఆదిత్య అద్లాఖా

గత ఏడాది నవంబర్‌లో ఆదిత్య అద్లాఖా(26)అనే భారతీయ విద్యార్థిని దారుణంగా హత్యకు గురయ్యాడు. సిన్సినాటి యూనివర్శిటీలో ఆదిత్య అద్లాఖా పీహెచ్‌డీ విద్యార్థి. ఒహియోలోని కారులో ఆయన్ని దుండగులు కాల్చి చంపారు. మరో కేసులో ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ చదువుతున్న అకుల్ ధావన్(18) అనే భారత సంతతి విద్యార్థి కూడా మృతి చెందాడు.

Also Read :MQ 9B : ఇండియాకు 31 ‘ఎంక్యూ-9బీ’ డ్రోన్లు .. ఎలా పనిచేస్తాయో తెలుసా ?