గత కొద్దీ రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. కనీస వేతనం రూ.25 వేలు ఇవ్వాలంటూ ఆందోళలను చేస్తూ..జిల్లాల కలెక్టరేట్లను ముట్టడి చేస్తున్నారు. ఈ క్రమంలో బుధువారం ఆదిలాబాద్ కలెక్టరేట్(adilabad collectorate) ముట్టడి ఉద్రిక్తత దారితీసింది. ఉదయం కలెక్టరేట్ ముందు అంగన్‌వాడీలు(anganwadi workers) ఆందోళన చేపట్టారు.
సీఐటీయూ (CITU), ఏఐటీయూసీ(AITUC) నాయకులతో కలిసి అంగన్‌వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ మట్టడికి యత్నించారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అంగన్‌వాడీలను అదుపు చేస్తున్న సమయంలో ఓ మహిళా ఎస్సై(SI) ధనశ్రీ (Dhanasri)ని కొందరు అంగన్‌వాడీలు జుట్టు పట్టుకుని లాగారు. దీంతో సదరు ఎస్‌ఐ కింద పడిపోయారు. అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి టూటౌన్ స్టేషన్‌కి తరలించారు. పోలీస్ స్టేషన్ లో కూడా వారంతా ఆందోళన కొనసాగించారు. న్యాయపరమైన డిమాండ్ల కోసం ఉద్యమిస్తుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేసారు.
Read Also : Transgender Laila : తెలంగాణ ఎన్నికల ప్రచారకర్తగా ట్రాన్స్‌జెండర్
వేతనాల పెంపుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రిటైర్మెంట్ పాలసీని వ్యతిరేకిస్తూ అంగన్‌వాడీలు 10 రోజులుగా విధులు బహిష్కరించారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న డిమాండ్ల కోసం సమ్మెను చేపట్టారు. తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలకేంద్రాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. సీఐటీయూ, ఏఐటీయూసీ తదితర కార్మిక సంఘాల నాయకులు అంగన్ వాడీల ఆందోళనకు మద్దతు తెలిపారు.
https://x.com/TeluguScribe/status/1704408277675921700?s=20