Site icon HashtagU Telugu

Runa Mafi : రూ.ల‌క్ష రుణ‌మాఫీలో అందోల్..మొదటి స్థానం

Andole 1st

Andole 1st

తెలంగాణ సర్కార్ (Telangana Govt) రుణమాఫీ (Runa Mafi ప్రక్రియ ప్రారంభించడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు, కాంగ్రెస్ శ్రేణులు (Farmers and Congress Ranks) సంబరాలు చేసుకుంటున్నారు. పలుచోట్ల సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ తమ అభిమానాన్ని , సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులను అప్పుల బాధల నుంచి విముక్తి చేశారని కొనియాడుతూ.. స్వీట్లు తినిపించుకుని డాన్సులు చేస్తున్నారు. ఈరోజు రూ. లక్ష వరకు లోన్ ఉన్న రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.6,098 కోట్లు జమ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

రూ.ల‌క్ష రుణ‌మాఫీలో రాష్ట్రంలో మొద‌టి స్థానంలో అందోల్ నియోజ‌క‌వ‌ర్గం (Andole Constituency) నిలిచింది. ఆ త‌ర్వాత స్థానాల్లో హుస్నాబాద్‌, క‌ల్వ‌కుర్తి రెండు, మూడు స్థానాలు ద‌క్కించుకున్నాయి. రూ.రెండు ల‌క్ష‌ల రుణ‌మాఫీలో భాగంగా మొద‌టి విడ‌త‌లో రూ.ల‌క్ష వ‌ర‌కు రుణాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం గురువారం మాఫీ చేయడం జరిగింది. రాష్ట్రంలోని 110 నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోని (9 న‌గ‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో రైతు రుణాలు లేవు) 10,84,050 రైతు కుటుంబాల‌కు చెందిన 11,50,193 మంది రైతుల రుణ ఖాతాల్లో రూ.6,098.93 కోట్లను రాష్ట్ర ప్ర‌భుత్వం జ‌మ చేసింది. దీంతో ఆ కుటుంబాల‌న్నీ రుణ‌విముక్తం అయ్యాయి. రుణ‌మాఫీ జ‌రిగిన 110 నియోజ‌క‌వ‌ర్గాల్లో అత్య‌ధికంగా అందోల్ నియోజ‌క‌వ‌ర్గంలో 19,186 రైతు కుటుంబాల‌కు చెందిన 20,216 మంది రైతుల‌కు చెందిన రూ.107.83 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. త‌ర్వాత హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో 18,101 రైతు కుటుంబాల‌కు చెందిన 18,907 మంది రైతుల‌కు చెందిన రూ.106.74 కోట్లు, క‌ల్వ‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో 17,270 రైతు కుటుంబాల‌కు చెందిన 18,196 మంది రైతుల‌కు చెందిన రూ.103.02 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి.

ఈరోజు( గురువారం) తెలంగాణ సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రైతులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేసినట్లు ప్రకటించారు. సుమారు పదకొండున్నర లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7వేల కోట్లు జమ చేసినట్లు వివరించారు. నిధులు విడుదల కావడంతో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు రైతువేదికల వద్ద సంబురాలు చేసుకుంటున్నారు. ఈ నెలాఖరుకు లక్షన్నర రూపాయలు, ఆగస్టు 15 నాటికి 2 లక్షల వరకు రుణాబకాయిలను రైతుల తరఫున ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించేలా ప్రణాళిక చేసింది.

Read Also : Runa Mafi : రుణమాఫీ అమలుకావడంతో..రాజీనామా పై స్పందించిన హరీశ్ రావు