Mulugu Municipality: ములుగు ప్రజల సుదీర్ఘ స్వప్నం ఫలించింది. నూతన మున్సిపాలిటీగా ములుగు (Mulugu Municipality) అవతరించబోతోంది. ఇప్పటివరకు గ్రామపంచాయతీగా ఉన్న ములుగును మున్సిపాలిటీగా మారుస్తూ శనివారం నాడు కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రక్రియ పూర్తి కాగానే ములుగు మున్సిపాలిటీగా అవతరించనుంది.
సెప్టెంబర్ 2022లోనే తెలంగాణ అసెంబ్లీ ములుగును మునిసిపాలిటీ చేస్తూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించినా.. బిల్లు సరిగా లేకపోవడంతో గవర్నర్ ఆమోదం తెలపలేదు. అప్పటి ప్రభుత్వం ములుగును మున్సిపాలిటీగా ఏర్పాటు చేసేందుకు చిత్తశుద్ధిగా పనిచేయలేదు. దీంతో గత రెండు సంవత్సరాలుగా ఈ అంశం పెండింగ్ లోనే ఉండిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం నిర్వాకం వల్ల.. జిల్లా కేంద్రంగా ములుగు అవతరించినా.. మున్సిపాలిటీకి నోచుకోలేదు. దీంతో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సీతక్క ములుగును మున్సిపాలిటీగా మార్చేందుకు కృషి చేశారు.
Also Read: Telangana Government: గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. రైతు భరోసా రూ.12 వేలు!
రాష్ట్ర గవర్నర్ ను, రాష్ట్రపతిని కలిసి బిల్లుకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. అయితే గత ప్రభుత్వం పాస్ చేసిన బిల్లులో పలు లోపాలు ఉండటంతో గవర్నర్ ఆమోదం తెలపలేదు. దీంతో మరోసారి ములుగును మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ పాత బిల్లును రీ కాల్ చేస్తూ కేటినెట్ శనివారం నాడు ఆమోదం తెలపడంతో.. ములుగు మున్సిపాలిటీకి మార్గం సుగుమయ్యింది. ములుగు మున్సిపాలిటీ కల నెరవేరడంతో ములుగు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ములుగు మున్సిపాలిటీ కల సాకారానికి కృషి చేసిన మంత్రి సీతక్కకు స్థానిక ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. అయితే ములుగు మున్సిపాలిటీగా చేయడంతో అక్కడ అభివృద్ధికి మరింత ఆస్కారం ఉండనుంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న కేబినెట్‌కు మంత్రి సీతక్క సైతం ధన్యవాదాలు తెలిపారు.