Site icon HashtagU Telugu

Lobo: యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష

Lobo

Lobo

Lobo: యాంకర్ లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్‌కు సంబంధించిన 2018 రోడ్డు ప్రమాద కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. జనగామ కోర్టు ఆయనకు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే.. 2018లో యాంకర్ లోబో స్వయంగా కారు నడుపుకుంటూ హైదరాబాద్‌ వైపు వస్తుండగా, జనగామ జిల్లా నిడిగొండ సమీపంలో దుర్ఘటన చోటుచేసుకుంది. అతడు నడుపుతున్న కారు ఓ ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మేడె కుమార్, పెంబర్తి మణెమ్మ దుర్మరణం చెందగా, ఢీ కొట్టిన తర్వాత కారు అదుపు తప్పి బోల్తా పడటంతో లోబోతో పాటు వాహనంలో ఉన్న పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Amaravati : ఏపీ మీదుగా రెండు బుల్లెట్ రైలు కారిడార్లకు ప్రాథమిక ఆమోదం

ఈ సంఘటనపై వెంటనే స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణలో సాక్ష్యాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా కోర్టు నిందితుడిపై నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ప్రాణ నష్టం జరిగిందని తేల్చింది. చివరికి నిన్న జనగామ కోర్టు తీర్పు వెలువరించి, లోబోకు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. ఈ తీర్పుతో మరోసారి రోడ్డు భద్రతా నియమాల ప్రాధాన్యం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం ఎంతటి దారుణ పరిణామాలకు దారితీస్తుందో చర్చనీయాంశమవుతోంది.

HYDRA : అక్రమ కట్టడాల తొలగింపులో హైడ్రా కీలక పాత్ర: హైకోర్టు ప్రశంస