Site icon HashtagU Telugu

Mahindra University : హైదరాబాద్‌లోని మహీంద్రా వర్సిటీకి 500 కోట్లు : ఆనంద్‌ మహీంద్రా

Anand Mahindra

Anand Mahindra

Mahindra University : ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్‌లో తాము ఏర్పాటు చేసిన మహీంద్రా యూనివర్సిటీకి రూ.500 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా రూ.100 కోట్లు చొప్పున వచ్చే ఐదేళ్లలో తమ కుటుంబం ఈ మొత్తాన్ని యూనివర్సిటీకి అందిస్తుందని వెల్లడించారు. యూనివర్సిటీని అత్యుత్తమ విద్యా కేంద్రంగా మార్చేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని ఆనంద్‌ మహీంద్రా(Mahindra University) ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. మహీంద్రా యూనివర్సిటీ అనుబంధ విద్యా సంస్థ ఇందిరా మహీంద్రా స్కూల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌కు మరో రూ.50కోట్లు ఇస్తామని ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join

2020లోనే హైదరాబాద్‌లో మహీంద్రా యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, డాక్టరేట్‌ స్థాయిల్లో 35 ప్రోగ్రామ్‌లను అందిస్తున్నారు. ఇప్పటివరకు ఇందులో 4100 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 10శాతం పీజీ చేస్తున్నవారే.త్వరలోనే ఈ యూనివర్సిటీ కింద స్కూల్‌ ఆఫ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌, లిబరల్‌ ఆర్ట్స్‌ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆనంద్ మహీంద్రా చెప్పారు.

Also Read :Phone Tapping Issue: రేవంత్ అరెస్ట్ కు ఫోన్ ట్యాపింగే కారణం: రఘునందన్ రావు

ఆనంద్‌ మహీంద్రా లవ్ స్టోరీ తెలుసా ?

  • పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా టీనేజ్‌లోనే ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారు. బాలీవుడ్‌ హీరో స్టైల్‌లో ప్రపోజ్‌ చేసి ఆమె మనసు గెలుచుకున్నారు.
  • అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదువుతుండగా ఒకసారి ఆయన కళాశాల ఎసైన్‌మెంట్‌ కోసం ఒక ఫిల్మ్‌ షూట్‌ చేయడానికి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వచ్చారు. అక్కడే ఆయన మొదటిసారి ఓ 17 ఏళ్ల యువతిని చూసి ప్రేమలో పడిపోయారు. ఆమే అనురాధ మహీంద్రా.
  • అనురాధను చూసిన తరువాత ఆనంద్‌ తిరిగి హార్వర్డ్‌కు వెళ్లలేకపోయారు.అందుకోసం ఒక సెమిస్టర్‌ పరీక్ష రాయకుండా ఇండోర్‌లోనే ఉండిపోయారు.
  • బాలీవుడ్‌ హీరో స్టైల్‌లో, తన అమ్మమ్మ ఇచ్చిన ఉంగరంతో అనురాధకు  ఆనంద్‌ మహీంద్రా ప్రపోజ్‌ చేశారు.
  • వీరిద్దరి పెళ్లి 1985 జూన్‌ 17న పెద్దల సమక్షంలో జరిగింది.
  • పెళ్లి తర్వాత ఈ దంపతులు బోస్టన్‌ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి అమెరికా వెళ్లారు.
  • అనురాధ మహీంద్రా బోస్టన్‌ విశ్వవిద్యాలయంలో కమ్యూనికేషన్‌ ప్రోగ్రామింగ్‌ చేశారు. అనంతరం జర్నలిజం, పబ్లిషింగ్‌లో తన కెరియర్‌ను ప్రారంభించారు.
  • అనురాధ మహీంద్రా ప్రసిద్ధ లగ్జరీ లైఫ్‌స్టైల్‌ మ్యాగజీన్‌ వెర్వ్‌ వ్యవస్థాపకురాలు. మ్యాన్స్‌ వరల్డ్‌ మ్యాగజీన్‌కు సహ వ్యవస్థాపకురాలు.
  • ముంబైలో జన్మించిన అనురాధ ప్రతిష్ఠాత్మక సోఫియా కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.

Also Read : Surekha Konidela : రామ్ చరణ్ పుట్టిన సందర్భంగా తల్లి చేసిన పని.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..