Site icon HashtagU Telugu

Telangana Youth : తెలంగాణ యువతకు 30 ఏళ్లకే ఆ రెండు వ్యాధులు

Telangana Youth

Telangana Youth

Telangana Youth : తెలంగాణలో 30 ఏళ్లు దాటిన వారు బీపీ, షుగర్‌ ముప్పును ఎదుర్కొంటున్నారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తాజా గణాంకాల్లో వెల్లడైంది. 60 ఏళ్లు దాటాక రావాల్సిన సమస్యలు 30 ఏళ్లకే ముసురుకుంటుండటం కలవరం రేకెత్తిస్తోంది. రాష్ట్రంలో 30 ఏళ్లు దాటిన వారికి వైద్యశాఖ నాన్‌ కమ్యూనికబుల్‌ డీసీజెస్ (NCD) స్క్రీనింగ్ చేస్తోంది. ఈ వైద్య పరీక్షల్లోనే పైవిషయాలు వెలుగుచూశాయి.

We’re now on WhatsApp. Click to Join

Also Read : 9144 Jobs : రైల్వేలో 9144 జాబ్స్.. నెలకు రూ.30వేల జీతం

Also Read :Miss World 2024 : ప్రపంచ సుందరి క్రిస్టినా పిస్కోవా గొప్ప పనులు.. తెలుసా ?

బీపీ, షుగర్‌ రావడానికి కారణాలు

  • తీవ్రమైన ఒత్తిడిలో పని చేయడం, సమయానికి తినకపోవటం, ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ తినడం, శారీరక శ్రమ అస్సలు లేకపోవడం వంటి  కారణాల వల్ల బీపీ, షుగర్ ఎటాక్ చేస్తాయి.
  • గుండె, మూత్ర పిండాల జబ్బులు, కేన్సర్‌ కేసులు కూడా తెలంగాణలో పెరుగుతున్నాయి.
  • జీవన శైలిలో మార్పులు చేసుకొని తగినంత వ్యాయామం, సమయానికి భోజనం, కంటినిండా నిద్రపోతే ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ పొందొచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు.

Also Read : Peshawar Blast: పాకిస్థాన్‌ బాంబు పేలుడులో ఇద్దరు మృతి