Top 10 Tourist Places: మన దేశంలోని టాప్-10 పర్యాటక ప్రదేశాల జాబితాను భారత పురావస్తు శాఖ (ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా-ఏఎస్‌ఐ) విడుదల చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సందర్శించిన పర్యాటకుల సంఖ్య ఆధారంగా ఈ ర్యాంకింగ్ ఇచ్చింది. అత్యధికంగా టూరిస్టులు చూసిన ప్రదేశాలకే టాప్-10లో చోటు దక్కింది. ఈ లిస్టులో మన హైదరాబాద్‌లోని పలు పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయి.
Also Read :Earthquake Today: ఢిల్లీని మించిన రేంజులో బెంగాల్‌లో భూకంపం.. బంగాళాఖాతంలో భూకంప కేంద్రం
టూరిస్టులంతా అక్కడికే..
భారత పురావస్తు శాఖ విడుదల చేసిన టాప్-10 లిస్టు ప్రకారం.. 6వ స్థానంలో గోల్కొండ కోట ఉంది. 9వ స్థానంలో చార్మినార్ ఉంది. నంబర్ 1 స్థానంలో మనందరికీ ఇష్టమైన తాజ్ మహల్ ఉంది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఉన్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఫైవ్ స్టార్ హోటళ్లు పెరిగాయి. రియల్ ఎస్టేట్ పెరిగింది. ఐటీ కంపెనీలు పెరిగాయి. కానీ టూరిస్టులు చూడటానికి వస్తున్నది మాత్రం.. గోల్కొండ కోట, చార్మినార్‌లనే అనే విషయం భారత పురావస్తు శాఖ విడుదల చేసిన జాబితాతో తేటతెల్లమైంది. ఈ ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు టూరిస్టు ప్రదేశాలను మరింతగా డెవలప్ చేయాలి. పర్యాటకులు వచ్చినప్పుడు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలి. గోల్కొండ కోట, చార్మినార్ కట్టడాల పరిరక్షణ కోసం నిర్మాణపరంగా కూడా చర్యలు చేపట్టాలి. ఆయా ప్రాంతాల ప్రజల వికాసం కోసం ప్రత్యేక పథకాలను అమలు చేయాలి. ఫలితంగా పరిసర ప్రాంతాల ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
Also Read :SLBC Tunnel : ఇంకా లభించని కార్మికుల ఆచూకీ
టూరిస్టులు ఇలా పెరిగారు
2023-24 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ పరిధిలో టూరిజం(Top 10 Tourist Places) 30 శాతం పెరిగిందని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. నగరానికి ఉన్న పురాతన చరిత్ర, రుచికరమైన వంటకాలు, ఆధునిక మౌలిక సదుపాయాల వల్లే టూరిస్టుల తాకిడి పెరుగుతోందని పేర్కొంది. గోల్కొండ కోటను 2023-24 ఆర్థిక సంవత్సరంలో 16.08 లక్షల మంది, 2022-23లో 15.27 లక్షల మంది సందర్శించారు. చార్మినార్‌ను 2023-24లో 12.90 లక్షల మంది, 2022-23లో 9.29 లక్షల మంది సందర్శించారు.