Third Eye: హైదరాబాద్ లో ఇన్ని సీక్రెట్ కెమెరాలా?

  • Written By:
  • Publish Date - November 13, 2021 / 12:12 AM IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదారాబాద్ నగరంలో 3.7 లక్షల సీసీ కెమెరాలు, తెలంగాణ వ్యాప్తంగా 8.3 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నేరనియంత్రణకు ఈ సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని ప్రభుత్వం, పోలీసులు క్రెడిట్ ఇస్తున్నారు.

Also Read: 580 ఏళ్ల తరువాత పాక్షిక చంద్రగ్రహణం.. ఏ రోజో తెలుసా!

అయితే అన్ని సీసీ టీవీలు పెట్టి ప్రజలను మానిటరింగ్ చేయడంపై ఇంటర్నేషనల్ మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ అభ్యంతరం తెలిపింది. దీనివల్ల మానవహక్కులకు భంగం కలుగుతోందని అమ్నెస్టీ ఆరోపించింది. ప్రజలని స్కాన్ చేయడం బ్యాన్ చేయాలని ఆ సంస్థ వాదిస్తోంది. సీసీటీవీ వాడకంపై గతంలో కోర్టులు కూడా స్పందించాయి. అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టడం సరైన పద్దతి కాదని, అది వ్యక్తిగత గోప్యతను దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించింది.

Also Read: జ‌గ‌న్ పై లోకేష్ `యంగ్ త‌రంగ్

సీసీ కెమెరాలతో భద్రత ఎంత ఉంటుందో అంతే స్థాయిలో వ్యక్తుల స్వేచ్ఛ హరించుకుపోతుందని ఎన్నో స్టడీలు కూడా వచ్చాయి. సీసీలు ఉన్న ప్రాంతంలో పనిచేసే వ్యక్తులపై ఒత్తిడి కూడా ఉంటుందని నిపుణుల వాదన.