Robbery : కాదేది కళకు అనర్హం అన్నాడు శ్రీశ్రీ.. కానీ.. ఇప్పుడు దొంగలు కాదేది చోరీ అనర్హం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దొంగకు చెప్పు కూడా లాభమే అన్న నానుడిని నిజం చేస్తూ.. ఓ దొంగోడు చేసిన నిర్వాకం అంతా ఇంతా కాదు.. ఓ దొంగోడు అంబులెన్స్ వాహనాన్ని చోరీ చేసి, పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఘటన ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతంలో జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ శివారు హయత్ నగర్‌లోని సన్ రైజ్ హాస్పిటల్‌లో కాలు గాయానికి చికిత్స తీసుకున్నాడు. చికిత్స పూర్తయిన తర్వాత, అతను హాస్పిటల్ పక్కన పార్క్ చేసిన 108 అంబులెన్స్ ను గమనించి, దాన్ని చోరీ చేసి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పారిపోయాడు.
అయితే, అంబులెన్స్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో… పోలీసులు రంగంలోకి దిగారు. చోరీకి గురైన వాహనాన్ని పట్టుకునేందుకు పోలీసులు ఛేజ్ సినిమా స్టైల్‌లో ప్రారంభమైంది. అయితే.. ఖమ్మం వైపు పారిపోతున్న దొంగను పట్టుకోవడం కోసం, హైవేపై ముమ్మరంగా.. చిట్యాల వద్ద ఎస్ఐ జాన్ రెడ్డి ప్రయత్నించారు. అయితే దొంగ వాహనంతో ముందుకెళ్లిపోయి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాను ఢీకొట్టి అక్కడి నుంచి పారిపోయాడు.
తర్వాత, కేతేపల్లి ఎస్ఐ శివతేజ టేకుమట్ల స్టేజ్ వద్ద మూసీ బ్రిడ్జిపై లారీలను అడ్డుగా పెట్టి అంబులెన్స్ వాహనాన్ని ఆపగలిగారు. అయితే.. అక్కడ అంబులెన్స్ వాహనాన్ని, దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న దొంగ, తన తప్పిదాన్ని మరింత చుట్టు చుట్టూ తప్పించుకునేందుకు మూసీ బ్రిడ్జి వద్ద కల్వర్టును ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యాడు.
తరువాత, దొంగను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించి, పోలీసులు విచారణ మొదలు పెట్టారు. అడిగిన ప్రశ్నలకు అతడు సమాధానాలు ఇవ్వలేకపోయాడు, దీంతో అతనికి మతిస్థిమితం లేకుండా ఈ దొంగతనం చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.
Read Also : TTD: టీటీడీ కీలక నిర్ణయం.. ఆ దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనం