Site icon HashtagU Telugu

Hyderabad : రేపటి నుండి అందుబాటులోకి మరో ఫ్లైఓవర్

Amberpet Flyover To Open Fr

Amberpet Flyover To Open Fr

హైదరాబాద్ నగర ట్రాఫిక్ (Hyderabad Traffic) సమస్యలను తగ్గించేందుకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. అంబర్‌పేట్ ఫ్లైఓవర్‌(Golnaka Amberpet flyover)ను మహాశివరాత్రి (Maha Shivaratri)సందర్భంగా ప్రారంభించనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రకటించారు. గోల్నాక చర్చ్ నుంచి అంబర్‌పేట్ వాణి ఫోటో స్టూడియో వరకు ఈ ఫ్లైఓవర్ విస్తరించనుంది. ఇటీవల మంత్రి కిషన్ రెడ్డి ఈ ప్రాజెక్టును పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ఈ మార్గంలో, ప్రయాణికుల ఇబ్బందులను తీర్చే దిశగా ఈ ఫ్లైఓవర్ నిర్మించామని ఆయన పేర్కొన్నారు.

Madhavi Latha : మాధవీలతపై కేసు నమోదు

ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించగా, భూసేకరణ వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనులను వేగవంతం చేయాలని కోరారు. భూసేకరణ కోసం ఇప్పటికే రూ. 2.51 కోట్లు చెల్లించినప్పటికీ, నేషనల్ హైవే అథారిటీకి భూమి అప్పగించలేదని మంత్రి విమర్శించారు. అలాగే, ఫ్లైఓవర్ కింద రోడ్డు అభివృద్ధి, గ్రీనరీ, బ్యూటిఫికేషన్ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం ఇప్పటివరకు రూ. 338 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. ఎప్పటి నుంచో ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ ప్రజలకు, ఈ శివరాత్రి నుండి కొంతవరకు ఉపశమనం లభించనుంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే, వరంగల్, ఖమ్మం ప్రజలకు కూడా ప్రయోజనం కలుగుతుందని కిషన్ రెడ్డి అన్నారు. నగర వాసులకు మరింత అనుకూలంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.