ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun ) కు కేటీఆర్ (KTR)తలనొప్పిగా మారాడా..? అంటే అవుననే అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. ప్రస్తుతం అల్లు అర్జున్ కు అరెస్ట్ (Allu Arjun Arrest)టెన్షన్ ఏ రేంజ్ లో ఉందో చెప్పాల్సిన పనిలేదు. పుష్ప 2 ప్రీమియర్ (Pushpa 2 Premiere ) సందర్బంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట లో మహిళా మృతి చెందిన కేసులో అల్లు అర్జున్ ను ఏ 11 గా చేర్చి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడం తో ఆయన ఒక్కరోజులోనే బయటకు వచ్చారు. కాకపోతే ఈ కేసు ప్రస్తుతం కోర్ట్ లో కొనసాగుతుండడంతో ఎప్పుడు ఏంజరుగుతుందో అనే టెన్షన్ అల్లు కుటుంబంలో ఇటు చిత్రసీమలో టెన్షన్ గా మారింది. ఇదే క్రమంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్..పదే పదే ఓ విషయాన్నీ ప్రస్తావించడం అభిమానుల్లో మరింత టెన్షన్ పెడుతుంది.
పుష్ప 2 సక్సెస్ మీట్ లో సీఎం రేవంత్ (CM Revanth) పేరును అల్లు అర్జున్ మరచిపోయాడని చెప్పే, అల్లు అర్జున్ ను రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించారని బిఆర్ఎస్ ఆరోపణ. కానీ కాంగ్రెస్ నేతలు , పోలీసులు మాత్రం అదేమీ లేదని మృతురాలి భర్త పిర్యాదు చేయడం వల్లే అరెస్ట్ చేసారని , అరెస్ట్ వ్యవహారం అనేది చట్టం పని అని , దానికి సీఎం రేవంత్ కు సంబంధం లేదని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. అయినప్పటికీ కేటీఆర్ మాత్రం పదే పదే సీఎం రేవంత్ పేరు చెప్పలేదు కాబట్టే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయించాడని అంటుండడం మరింత కాకరేపుతుంది. అసలు కేటీఆర్ వల్లే ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని అభిమానులు అంటున్నారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లో సీఎం రేవంత్ పేరు అల్లు అర్జున్ మరచిపోయాడని బయటకు తీసింది..వైరల్ చేసింది కేటీఆర్ అని , కేటీఆర్ ఆలా అనడం వల్లే ప్రజలకు తెలిసిందని అభిమానులు అంటున్నారు. ఆరోజు కేటీఆర్ ఆలా చెప్పకపోతే అసలు ఎవ్వరు పట్టించుకునే వారు కాదని , కేటీఆర్ ఆలా అనేసరికి కాంగ్రెస్ నేతల్లో ఆగ్రహం పెరిగిందని ఫ్యాన్స్ వాపోతున్నారు. ఇక ఇప్పుడు అంత మరచిపోతున్న క్రమంలో కేటీఆర్ పదే పదే ఆ విషయాన్నీ గుర్తుచేసి మరింత ఆగ్రహం నింపుతున్నాడని..కేటీఆర్ బన్నీ కి తలనొప్పిగామారాడని ఫ్యాన్స్ అంటున్నారు.
Read Also : Pushpa 2 Stampede : సంధ్య థియేటర్ కు షోకాజ్ నోటీసులు