Site icon HashtagU Telugu

Alliance politics : తెలంగాణ ఎన్నికల చిత్రం! అలా..3వ ప్లేస్ లోకి బీఆర్ఎస్!!

Alliance Politics

Alliance Politics

తెలంగాణ ఎన్నిక‌ల(Alliance politics) చిత్రం మారిపోతోంది. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావ‌డానికి సానుకూల ప‌రిస్థితులు స‌మ‌కూరుతున్నాయి. మునుగోడు ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీకి మ‌ద్ధ‌తు ఇచ్చిన కామ్రేడ్లు కేసీఆర్ కు దూరం అవుతున్నారు. జాతీయ స్థాయి ఈక్వేష‌న్ల క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ, క‌మ్యూనిస్ట్ ల పొత్తు ఖాయంగా క‌నిపిస్తోంది. అంతేకాదు, ముస్లిం మైనార్టీల పెద్దల నుంచి వ‌స్తోన్న ఒత్తిడి కార‌ణంగా కాంగ్రెస్ పార్టీతో జ‌త క‌ట్ట‌డానికి ఎంఐఎం కూడా సిద్ధ‌ప‌డుతోందని వినికిడి. ఇలాంటి ప‌రిస్థితుల్లో బీఆర్ఎస్, బీజేపీ అడ్ర‌స్ లేకుండా పోయే ప్ర‌మాదం ఉంద‌ని తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే అంచ‌నాకు వ‌స్తోన్న వాళ్లు లేక‌పోలేదు.

తెలంగాణ ఎన్నిక‌ల చిత్రం (Alliance politics) 

తెలంగాణ రాష్ట్ర స‌మ‌తి నుంచి భార‌త రాష్ట్ర స‌మితిగా మార్చిన త‌రువాత జాతీయ వాదం(Alliance politics) అందుకున్నారు కేసీఆర్. దీంతో తెలంగాణ వాదంపై ఆయ‌నకు ఉన్న ప‌ట్టు స‌డ‌లింది. అంతేకాదు, జాతీయ స్థాయిలో మోడీతో ఢీ కొట్టిన కేసీఆర్క ప‌క్షాన ఒకానొక సంద‌ర్భంలో కాంగ్రెస్ సానుకూల‌త ప్ర‌ద‌ర్శించింది. ప్ర‌తిగా బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ ప‌ట్ల సానుభూతిని ప్ర‌ద‌ర్శించింది. కానీ, ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ తెర మీద‌కు వ‌చ్చిన త‌రువాత బీజేపీకి అడుగుల‌కు మ‌డుగులొత్తున్నారు కేసీఆర్. ప్ర‌త్యేకించి శ‌ర‌త్ చంద్రారెడ్డి అప్రూవ‌ర్ గా మారిన త‌రువాత పూర్తిగా బీజేపీ నీడ‌కు బీఆర్ఎస్ చేరింద‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా క‌లుగుతోంది.

బీఆర్ఎస్ బ‌ల‌హీన‌ప‌డింద‌న్న అభిప్రాయం మునుగోడు ఉప ఎన్నిక త‌రువాత

రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ బ‌ల‌హీన‌ప‌డింద‌న్న అభిప్రాయం మునుగోడు ఉప ఎన్నిక త‌రువాత బ‌య‌ట‌ప‌డింది. ఆ ఎన్నికలో క‌మ్యూనిస్ట్ ల మ‌ద్ధ‌తు లేకుండా బీఆర్ఎస్ వెళితే ఓడిపోయేది. అందుకే, కామ్రేడ్ల మ‌ద్ధ‌తును (Alliance politics) కేసీఆర్ కూడ‌గ‌ట్టుకున్నారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఇదే ప‌రిస్థితి ఉందని స‌ర్వేల సారాంశం. ప్ర‌త్యేకించి ద‌క్షిణ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ బ‌ల‌హీనంగా ఉంది. ఆ ప్రాంతంలో ఉభ‌య క‌మ్యూనిస్ట్ లు డిసైడ్ ఫ్యాక్ట‌ర్ గా ఉన్నారు. అందుకే, క‌మ్యూనిస్ట్ ల‌తో క‌లిసి ఈసారి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని తొలుత కేసీఆర్ స్కెచ్ వేసుకున్నారు. కానీ, ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ వ్య‌వ‌హారంతో బెడిసి కొట్టింది. బీజేపీకి అంట‌కాగుతూ ఢిల్లీ పెద్ద‌ల‌కు స‌లాం కొట్టేలా కేసీఆర్ వాయిస్ ఇప్పుడు వినిపిస్తోంది.

బీఆర్ఎస్ తో స‌హ‌జ మిత్ర‌త్వాన్ని కొన‌సాగిస్తే మునిపోతామ‌న్న భావ‌న ఎంఐఎం పెద్ద‌ల్లో

జాతీయ‌, రాష్ట్రా స్థాయిల్లో బీజేపీకి వ్య‌తిరేకంగా ప‌నిచేయ‌డం క‌మ్యూనిస్ట్ లు, ఎంఐఎం పార్టీల విధానం. క‌మ‌ల నాథుల‌ను అధికారంలోకి రాకుండా చేయ‌డానికి ఏ పార్టీతోనైనా (Alliance politics) జ‌త క‌డ‌తారు. ఆ ఈక్వేష‌న్లో బీఆర్ఎస్ తో క‌లిసి రాష్ట్రంలో జ‌త క‌డ‌తార‌ని ఇటీవ‌ల వ‌ర‌కు భావించారు. కానీ, క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత సీన్ మారింది. ముస్లిం ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మ‌ళ్లింద‌ని క్లియ‌ర్ గా అర్థ‌మ‌వుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో బీఆర్ఎస్ తో స‌హ‌జ మిత్ర‌త్వాన్ని కొన‌సాగిస్తే మునిపోతామ‌న్న భావ‌న ఎంఐఎం పెద్ద‌ల్లో ఉంద‌ని తెలుస్తోంది. అలాగే, బీజేపీతో తెర వెనుక సంబంధాల‌ను కొన‌సాగిస్తోన్న కేసీఆర్ ఈనెల 23న జ‌రిగే విప‌క్షాల స‌మావేశానికి హాజ‌రు కావ‌డంలేదు. దీంతో క‌మ్యూనిస్ట్ లు కాంగ్రెస్ పార్టీతో క‌లిసి రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ వెళ్లే ఛాన్స్ క‌నిపిస్తోంది.

Also Read : Kothagudem BRS: కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్థిగా గడల శ్రీనివాసరావు?

ఒక వైపు కాంగ్రెస్, ఉభ‌య క‌మ్యూనిస్ట్ లు, ఎంఐఎం కూట‌మి(Alliance politics) మ‌రో వైపు బీజేపీ,టీడీపీ, జ‌న‌సేన కూట‌మి ఇంకో వైపు బీఆర్ఎస్ రంగంలోకి దిగేలా తాజా ఎన్నిక‌ల చిత్రం క‌నిపిస్తోంది. అదే జ‌రిగితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుంద‌ని అంచ‌నాలు వేస్తున్నారు. రెండో స్థానంలో బీజేపీ, టీడీపీ కూట‌మి ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ఒంట‌రిగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోతుంద‌ని తాజా స‌ర్వేల సారాంశం. అందుకే, సిట్టింగ్ ల‌కు టిక్కెట్లు ఇచ్చేదిలేద‌ని కేసీఆర్ సంకేతాలు ఇస్తున్నారు. ఆయ‌న ఎన్ని ర‌కాల జిమ్మిక్కులు చేసిన ఈసారి మారిన ఈక్వేష‌న్లు బీఆర్ఎస్ కు(BRS) ప్ర‌తికూలంగా ఉంటాయ‌ని తాజా ప‌రిణామాలు, స‌మీక‌ర‌ణాల‌ను గ‌మ‌చించే వాళ్లు అంచ‌నా వేయ‌డం గ‌మ‌నార్హం.

Also Read : KCR’s Coverts: బీజేపీలో కేసీఆర్ కోవర్ట్ లు..! జాబితా రెడీ..!!