Alliance : టీడీపీ పొత్తుకు బండి నో ! బీజేపీలో చేరిక‌లకు బ్రేక్! బాబుతో బీఆర్ఎస్?

హైద‌రాబాద్లోజ‌రిగిన బీజేపీ స‌మావేశంలో టీడీపీతో పొత్తు(Alliance)అంశం సంచ‌ల‌నంగా మారింది.

  • Written By:
  • Updated On - December 31, 2022 / 01:45 PM IST

హైద‌రాబాద్ వేదిక‌గా మూడు రోజుల పాటు జ‌రిగిన బీజేపీ కీల‌క స‌మావేశంలో టీడీపీతో పొత్తు(Alliance) అంశం సంచ‌ల‌నంగా మారింది. దానిపై క్లారిటీ కావాల‌ని ఎంపీ అర‌వింద్, మాజీ ఎంపీ విజ‌య‌శాంతి ప్ర‌శ్నించ‌డంతో బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడి బండి సంజ‌య్ డైల‌మా (dilama)లో ప‌డ్డారు. స‌మావేశాల ముగింపు సంద‌ర్భంగా తెలుగుదేశం, బీజేపీ పొత్తు ఉండ‌బోద‌ని స్ప‌ష్ట‌త ఇచ్చారు. ఆయ‌న ఇచ్చిన స్టేట్ మెంట్ పై బీజేపీలోని సీనియ‌ర్లు చాలా మంది ఆలోచ‌న‌లో ప‌డ్డారు. అంతేకాదు, ఇత‌ర పార్టీల నుంచి బీజేపీ వైపు చూసే వాళ్లు కూడా డైల‌మా (dilama) లో ప‌డ్డారు.

బీజేపీ టీడీపీతో పొత్తు(Alliance)

ఖ‌మ్మం వేదిక‌గా జ‌రిగిన చంద్ర‌బాబు స‌భ బీజేపీలోని పెద్ద‌ల‌ను ఆలోచింప చేస్తోంది. అంతేకాదు, నిజామాబాద్‌, వరంగ‌ల్‌, సికింద్రాబాద్ స‌భ‌ల‌ను టీడీపీ ప్లాన్ చేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు స‌మాయాత్తం అవుతోన్న టీడీపీ దూకుడును పొత్తు (Allliance) దిశ‌గా ప్ర‌త్య‌ర్థులు చూస్తున్నారు. ఏపీలో పొత్తు కోసం చంద్ర‌బాబు తెలంగాణ‌లో స‌భ‌లు పెడుతున్నార‌ని బీజేపీ భావిస్తోంది. ఇదంతా గేమ్ ప్లాన్ లో భాగంగా చూస్తోంది. అందుకే, బీజేపీ ఒంటరిగా తెలంగాణ‌లో రాజ్యాధికారం దిశ‌గా ప్ర‌య‌త్నిస్తుంద‌ని బండి సంజ‌య్ చెబుతున్నారు. కానీ, క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితులు భిన్నంగా ఉన్నాయ‌ని ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు గ్ర‌హిస్తున్నారు.

Also Read : TDP, BJP and Janasena: తెలంగాణపై ‘ఆంధ్రా’ పొత్తులు.. మోడీ వ్యూహం ఫలించేనా!

వాస్త‌వంగా తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకు తెలంగాణ వ్యాప్తంగా ఉంది. క‌నీసం 35 నుంచి 40 స్థానాల్లో గెలుపోట‌ముల‌ను నిర్దేశించి స్థాయిలో ఓట‌ర్లు ఉన్నారు. సీరియ‌స్ గా తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థుల‌ను నిలిపితే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మీద ప్ర‌భావం ప‌డ‌నుంది. ఎందుకంటే, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల‌కు టీడీపీ దూరంగా ఉన్న స‌మ‌యంలో బీజేపీ 44 మంది కార్పొరేట‌ర్ల‌ను గెలుచుకుంది. కేవ‌లం 48 మంది కార్పొరేట‌ర్ల‌ను మాత్ర‌మే టీఆర్ఎస్ గెలుచుకుంది. సెటిట‌ర్లు ఎక్కువ‌గా ప్రాంతాల్లో మాత్ర‌మే టీఆర్ఎస్ పార్టీ కార్పొరేట‌ర్లు గెలిచారు. మిగిలిన చోట్ల బీజేపీ విజ‌యం సాధించింది. అంటే, ప్ర‌స్తుతం సెటిల‌ర్లు ఎక్కువ‌గా బీఆర్ఎస్ వైపు ఉన్నార‌ని అంచ‌నా. అదే, తెలుగుదేశం, బీజేపీ పొత్తు కుదిరితే, బీజేపీకి అనుకూలంగా సెటిల‌ర్లు ఓటు ఉండే అవ‌కాశం ఉంది.

టీడీపీతో పొత్తు ఉండ‌ద‌ని సంజ‌య్ ప్ర‌క‌టించ‌డం

కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌రువాత కొంద‌రు ఓటు బ్యాంకు రేవంత్ రెడ్డితో వెళ్లింది. లీడ‌ర్లు కూడా కొంద‌రు ఆయ‌న్ను అనుస‌రించి వెళ్లారు. బీజేపీ, టీడీపీ పొత్తు ఖాయమైతే, కాంగ్రెస్ పార్టీ ఖాళీ కానుందని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో టీడీపీతో పొత్తు ఉండ‌ద‌ని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజ‌య్ ప్ర‌క‌టించ‌డం ఆ పార్టీకే న‌ష్టం. నాలుగు నెల‌ల క్రితం చేరికల క‌మిటీని ఏర్పాటు చేసిన‌ప్ప‌టికీ ఇత‌ర పార్టీ నుంచి బీజేపీలోకి పెద్ద‌గా ఎవ‌రూ వెళ్ల‌లేదు. ఇప్పుడిప్పుడే ఆ పార్టీ గురించి ఆలోచిస్తోన్న స‌మ‌యంలో టీడీపీతో పొత్తు ఉండ‌ద‌ని తేల్చ‌డంతో ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చే వాళ్లు డైల‌మాలో ప‌డిపోయారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పూర్వ‌పు టీడీపీ లీడ‌ర్లు, కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తి వాదులుగా బీజేపీ వైపు మొగ్గుతార‌ని అనుకున్నారు. తాజాగా బండి సంజ‌య్ పొత్తుల‌పై చేసిన కామెంట్ల‌తో ఎవ‌రూ బీజేపీలో చేరే ప‌రిస్థితి లేద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

Also Read : BJP, TDP Alliance : చంద్ర‌బాబుతో బీజేపీ?టార్గెట్ కేసీఆర్‌! గుజ‌రాత్ ఫ‌లితాల జోష్‌!

గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్, టీడీపీ పొత్తు ఉన్నాయి. ఆ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ న‌ష్ట‌పోయింద‌ని బండి సంజ‌య్ చెప్పే లెక్క‌. కానీ, 1999, 2004, 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ, బీజేపీ పొత్తు విజ‌య‌వంతం అయింది. ఆ రెండు పార్టీ పొత్తు ఫెయిల్ అయిన సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవ‌డం టీడీపీ చేసిన అతి పెద్ద త‌ప్పు. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల‌కు వ్య‌తిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ. దాన్ని కాంగ్రెస్ పార్టీ గొడుగు కింద‌కు తీసుకెళ్ల‌డం చంద్ర‌బాబు చేసిన పొర‌బాబు. దాని ప్ర‌భావం ఏపీలోనూ టీడీపీని దెబ్బ‌తీసింది. అంటే, 2018, 2019 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ కంటే టీడీపీ ఎక్కువ‌గా పొత్తు కార‌ణంగా న‌ష్ట పోయింది. ఆ విష‌యాన్ని బండి సంజ‌య్ గ్ర‌హించ‌లేక‌పోతున్నారు. ఒక వేళ పొత్తు వ‌దులుకుంటే, టీడీపీ రూపంలో బీజేపీకి గండి ప‌డ‌నుంది. రాజ్యాధికారం బీజేపీకి క‌ల‌గా మార‌నుంద‌ని కాంగ్రెస్, బీఆర్ఎస్ అంచ‌నా వేయ‌డం గ‌మ‌నార్హం.

Also Read : BJP Vs TDP : క‌మ‌లవ్యూహంలో 40 ఏళ్ల టీడీపీ