Harish Rao: మా ఇంటి ఓట్లన్నీ హరీష్ రావుకే.. సిద్దిపేటలో పోస్టర్స్ వైరల్

ప్రతి ఎన్నికల్లో హరీశ్ రావు మెజార్టీ పెరుగుతుందే తప్పా ఏమాత్రం తగ్గడం లేదు.

Published By: HashtagU Telugu Desk
2

2

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తన్నీరు హరీశ్ రావుది ఓ ప్రత్యేక ముద్ర. సిద్దిపేట అంటే హరీశ్ రావు.. హరీశ్ రావు అంటే సిద్దిపేట అనేతంగా ఆయనకు పేరుంది. అయితే ఆయన వచ్చే ఎన్నికల్లో అక్కడ్నుంచే పోటీ చేయనున్నారు. అయితే ఇప్పటివరకు సిద్దిపేట లో హరీశ్ రావును ఓడించే నాయకుడు లేకపోవడం గమనార్హం. ప్రతి ఎన్నికల్లో ఆయన మెజార్టీ పెరుగుతుందే తప్పా ఏమాత్రం తగ్గడం లేదంటే ఆయన క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.

వచ్చే ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట ప్రజలు హరీశ్ వెంటా ఉంటామని చెబుతున్నారు. ‘అన్నా అంటే నేనున్నా’ అంటూ.. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు మంత్రి Harish Rao Thanneeru గారు… రానున్న ఎన్నికల్లో మా మద్దతు మంత్రి హరీష్ రావు గారికే’’ నంటూ తన ఇంటికి ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు సిద్దిపేట పట్టణం లోని 20 వార్డుకు చెందిన మహ్మద్ చాంద్.

తమ కుటుంబంలోని 17 ఓట్లన్నీ మంత్రి హరీష్ రావుకే ఆయన తేల్చి చెప్పారు. తన్నీరు హరీశ్ రావు తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2014-2018 మధ్యకాలంలో తెలంగాణ నీటిపారుదల, మార్కెటింగ్-శాసన వ్యవహారాల మంత్రిగా పనిచేశారు.

Also Read: BRS Party: బీజేపీకి షాక్.. బీఆర్ఎస్ లోకి అంబర్ పేట కార్పొరేటర్!

  Last Updated: 22 Sep 2023, 01:35 PM IST