Site icon HashtagU Telugu

Formula E Racing: ఫార్ములా E ప్రపంచ ఛాంపియన్‌షిప్ రేసుకు అంతా రెడీ!

Formula Racing

Formula Racing

శనివారం జరిగే ABB FIA ఫార్ములా E ప్రపంచ ఛాంపియన్‌షిప్ రేసు (Formula E Racing) కోసం హైదరాబాద్ ముస్తాబవుతోంది. ఈ భారతదేశపు మొట్టమొదటి ఫార్ములా E రేసు (Hyderabad) హుస్సేన్ సాగర్ చుట్టూ 2.8-కిమీ ట్రాక్‌లో జరుగుతుంది. ఇందులో మొత్తం 18 మలుపులు ఉంటాయి. 20,000 మంది ప్రేక్షకులు ఈ రేస్ ను చూసేందుకు వీలుగా ఏర్పాట్లు జరిగాయి. ఇందులో నాలుగు రకాల టిక్కెట్లున్నాయి. రూ.1,000 ధర ఉన్న గ్రాండ్‌స్టాండ్, రూ.4,000 ధర కలిగిన చార్జ్డ్ గ్రాండ్‌స్టాండ్ టిక్కట్లు (Tickets) మొత్తం ఇప్పటికే అమ్ముడయ్యాయి. ప్రీమియం గ్రాండ్‌స్టాండ్ – రూ. 7,000, ఏస్ గ్రాండ్‌స్టాండ్ ధర రూ. 10,500 టిక్కెట్లు ఇంకా ఉన్నాయి. 1.25 లక్షల రూపాయల‌ ఏస్ లాంజ్ ప్యాకేజీ కూడా ఉంది.

ఫార్ములా E, (Formula E Racing) ఇతర మోటార్‌స్పోర్ట్‌ల మధ్య ప్రధాన వ్యత్యాసం కార్లు. అన్ని కార్లు ఎలక్ట్రిక్, 250kW బ్యాటరీతో నడిచేవి. ఇవి గంటకు 280కిమీ వేగంతో దూసుకుపోగలవు. పూర్తి వేగంతో రేసింగ్ చేస్తున్నప్పుడు కార్ల శబ్దం స్థాయిలు కేవలం 80 డెసిబుల్స్ మాత్రమే ఉంటాయి. ఈ కార్లకు హైబ్రిడ్ టైర్లను ఉపయోగిస్తారు. ఈ కార్లు (E-cars) అన్ని వాతావరణ పరిస్థితులలో నడిచే విధంగా రూపొందించబడ్డాయి. ఈ ఫార్ములా E రేసులో (Formula E Racing) 11 జట్లు, 22 మంది డ్రైవర్లు పాల్గొంటున్నారు.

Also Read: The Kashmir Files: ‘ది క‌శ్మీర్ ఫైల్స్‌` మూవీకి భాస్క‌ర్ అవార్డు కూడా రాదు: ప్రకాశ్ రాజ్