ఒక్క రెండు రోజులైతే చాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా (Telangana) మోత మోగబోతుంది. అదేంటి అనుకుంటున్నారా..? మీము చెప్పేది ఎన్నికల ప్రచారం (Election Campaign) మోత. తెలంగాణ తో పాటు మరో నాల్గు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే 23 తర్వాత మిగతా నాల్గు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ (Election Polling) పూర్తి అవుతుంది. 24 నుండి జాతీయ నేతలు , లోకల్ నేతలు పూర్తి స్థాయిలో తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిజీ కాబోతున్నారు. ప్రధాని మోడీ (PM Modi) , రాహుల్ (Rahul) , అమిత్ షా (Amith Sha) , ప్రియాంక (Priyanka) , పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇలా గల్లీ నేతల నుండి ఢిల్లీ నేతల వరకు అంత ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.
ఇప్పటికే ప్రధాని మోడీ , అమిత్ షా , రాహుల్ , ప్రియాంక , సోనియా , ఖర్గే ఇలా అగ్ర నేతలంతా ప్రచారం చేయగా..మరోసారి ప్రచారం చేయబోతున్నారు. ఇక లోకల్ నేతలు సైతం గత 20 రోజులుగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఉదయం పాలవాడి కంటే ముందే ప్రచార ఆటో అందర్నీ నిద్రలేపి వెళ్తుంది. ఉదయం నుండి రాత్రి పడుకునేవరకు ఒకదాని తర్వాత ఒకటి పార్టీలకు సంబదించిన ప్రచార ఆటోలు ప్రచారం చేస్తూ వెళ్తున్నాయి. ఇక ఇప్పుడు అగ్ర నేతలు కూడా ఒకరి తర్వాత ఒకరు రాబోతున్నారు.
ప్రధాని మోడీ నవంబర్ 25,26,27 తేదీల్లో మూడు రోజుల పాటు తెలంగాణలోనే పర్యటించబోతున్నారు. 25న కామారెడ్డి, మహేశ్వరం; 26న తూప్రాన్, నిర్మల్‌లలో బహిరంగ సభలున్నాయి. 27న మహబూబాబాద్, కరీంనగర్ బహిరంగ సభలతో పాటు హైదరాబాద్ రోడ్‌షోలో పాల్గొని తన ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా 24,26,28 తేదీల్లో తెలంగాణకు రానున్నారు. వీరితో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, హిమంత్ బిశ్వశర్మ, సావంత్ ఇలా పలువురు బిజెపి నేతలు ప్రచారంలో పాల్గొనబోతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక లు నవంబర్ 24 నుంచి 28 వరకు రాష్ట్రంలో వరుస సభల్లో పాల్గొననున్నారు. దాదాపు 20 వరకు సభల్లో పాల్గొంటారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రియాంక 24, 25, 27 తేదీల్లో పది నియోజకవర్గాలను పర్యటిస్తారు. 24న పాలకుర్తి, హుస్నాబాద్, ధర్మపురి సభల్లో, 25న పాలేరు, ఖమ్మం, వైరా, మధిర, 27న మునుగోడు, దేవరకొండ, గద్వాల ప్రచార సభల్లో ప్రసంగిస్తారు. రాహుల్ 24 నుంచి రాష్ట్రంలోనే ఉండి 28న రాష్ట్రంలో ప్రచారం ముగిస్తారు. కామారెడ్డిలో 26న సభలో పాల్గొంటారు. మూడు,నాలుగు రోజులు వరుస సభలు, ర్యాలీల్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది.
సీపీఎం నుంచి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కారత్, సుభాషిణి అలీ, విజయరాఘవన్ మరికొందరు 25, 26, 27 తేదీల్లో నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్ సభల్లో పాల్గొననున్నారు. అలాగే జనసేన, బీజేపీ అభ్యర్ధులకు మద్దతుగా జనసేనాని పవన్ కల్యాణ్ కూడా రేపటి నుంచి ప్రచార బరిలోకి దిగనున్నారు. 28 వరకు సభలు, రోడ్ షోల్లో పాల్గొంటారు. జనసేన నుండి పోటీ చేస్తున్న అభ్యర్ధుల నియోజకవర్గాలు అయిన వరంగల్ వెస్ట్, కొత్త గూడెం, సూర్యపేట, దుబ్బాక, తాండూరులలో ఆయన ప్రచారం నిర్వహించబోతున్నారు. ఇలా వరుసగా నేతలంతా వారం పాటు ప్రచారంలో బిజీ కాబోతున్నారు. దీంతో ఈ వారం అంత రాష్ట్రం మోత మోగబోతుంది.
Read Also : Hi Nanna Promotions : ఎన్నికల ప్రచారాన్ని గట్టిగా వాడుకుంటున్న నేచురల్ స్టార్ నాని