Ration Card KYC : మీ రేషన్ కార్డు కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకున్నారా ? ఒకవేళ ఇంకా పూర్తి చేసుకోకుంటే.. ఇకనైనా త్వరపడండి. ఎందుకంటే డెడ్ లైన్ ముంచుకొస్తోంది. జూన్ 30లోగా రేషన్ కార్డు కేవైసీని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంది. లేదంటే కేవైసీ చేయించుకోని వారి పేర్లను రేషన్ కార్డులో నుంచి తొలగిస్తారు. వాళ్ల పేరిట రేషన్ సరుకులు ఇకపై తీసుకోలేరు. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రేషన్ కార్డుదారుల కేవైసీ నమోదు ప్రక్రియను ప్రారంభించారు. ఈ ప్రక్రియ గత 7 నెలలుగా కొనసాగుతోంది. అయినా ఇప్పటికీ చాలామంది కేవైసీ పూర్తి చేసుకోలేదు. కొందరికి సంబంధించిన వేలిముద్రలు మ్యాచ్ కావడం లేదు. దీంతో వారు కేవైసీ పూర్తి చేసుకోలేకపోతున్నారు. కొందరు అలసత్వంతో రేషన్ షాపుకు వెళ్లి కేవైసీ చేయించుకోవడం లేదు. ఇంకొందరికి ఆధార్ అప్డేట్ సమస్యలతో కేవైసీ(Ration Card KYC) పూర్తి కావడం లేదు.
Also Read :Amaravati Vs Vizag : ఏపీ రాజధానిగా అమరావతి.. ఆర్థిక రాజధానిగా విశాఖ : చంద్రబాబు
ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి ప్రయోజనం పొందాలంటే రేషన్ కార్డు చాలా కీలకం. అందులో పేరు లేకుంటే చాలా ప్రభుత్వ ప్రయోజనాలు దూరమవుతాయి. అందుకే వెంటనే రేషన్ షాపునకు వెళ్లి మనం కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఒకవేళ రేషన్ కార్డు నుంచి పేరును తీసేస్తే.. మళ్లీ అప్లై చేసి చేర్పించుకోవచ్చు. అయితే అది చాలా పెద్ద ప్రాసెస్. స్థానిక ఎమ్మార్వో ఆఫీసులో అప్లై చేయడం.. వీఆర్వోతో ఎంక్వైరీ చేయించుకోవడం.. చివరకు సివిల్ సప్లైస్ జిల్లా ఆఫీసు నుంచి ఆమోదం పొందడం వంటివన్నీ జరగాలి. ఇవన్నీ జరిగితేనే మళ్లీ మన పేరు రేషన్ కార్డులో చేరుతుంది. దీని కోసం మనం చాలా టైం వేస్ట్ చేసుకొని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇన్ని వ్యయ,ప్రయాసలు ఎదురుకావద్దంటే.. ఇప్పుడు రేషన్ షాపునకు వెళ్లి కేవైసీ చేసుకోవడం చాలా బెటర్.
Also Read : Elon Musk : ఐఫోన్లలో ఛాట్ జీపీటీ.. భారతీయ మీమ్‌తో ‘మస్క్’ కౌంటర్
రేషన్ కార్డు లేనివారు స్థానిక ఎమ్మార్వో వద్దకు వెళ్లి అప్లై చేయాల్సి ఉంటుంది. అర్హత ఉన్న ప్రతీ కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తామని సీఎం రేవంత్ సర్కార్ చెబుతోంది. కొత్త రేషన్ కార్డులను ఇవ్వడంలో భాగంగా ప్రతీ ఇంటికి ప్రభుత్వ సిబ్బంది వెళ్లి క్షేత్ర స్థాయి పరిశీలన చేయనున్నట్లు సమాచారం.