హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నగరంలోని ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ప్రధానంగా ఆగస్టు 15న గోల్కొండ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
15వ తేదీ ఉదయం 7Hrs నుంచి మధ్యాహ్నం 12Hrs వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఆంక్షల సమయంలో రామ్‌దేవ్‌గూడ నుండి గోల్కొండ కోట వరకు రహదారిని పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
కాగా స్వతంత్ర దినోత్సవ వేడుకలను చారిత్రాత్మక గోల్కొండ కోటలో ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. పోలీస్, రోడ్లు, భవనాలు, సమాచార శాఖ, జీహెచ్ఎంసీ, విద్యుత్, రవాణా తదితర శాఖలు తమ శాఖాపరమైన ఏర్పాట్లను చేయాలని సీఎస్ అన్నారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలు పకడ్బందీ ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లోని అమర వీరుల స్మారక స్థూపం వద్ద కూడా ఆర్మీ జీ.ఓ.సి అధికారులతో సమన్వయంతో తగు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ఈ సందర్బంగా సీఎస్ మాట్లాడుతూ, ఆగస్టు 15న గోల్కొండలో ఉదయం 10.30 గంటలకు సీఎం కేసీఆర్ గారు జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని, దీనికి ముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో అమరవీరుల స్మారక స్థూపం వద్ద స్వతంత్ర సమరయోధులకు శ్రద్ధాంజలి ఘటిస్తారని తెలిపారు.
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ద్రౌపది ముర్ము నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రాత్రి ఏడు గంటలకు రాష్ట్రపతి ప్రసంగాన్ని అన్ని రేడియో, దూరదర్శన్ చానళ్ళు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. అనంతరం రాష్ట్ర పతి ప్రసంగం తెలుగు అనువాదం దూరదర్శన్ సప్తగిరి చానల్ లో ప్రసారమవుతుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చివరిరోజైన ఈనెల 11న నాడు వాయిదా పడిన ఉభయ సభలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రోరోగ్ చేశారు. లోక్‌సభ, రాజ్యసభలను ప్రోరోగ్ చేసినట్లు ప్రకటించారు.
Also Read: Tirumala: టీటీడీ భక్తులకు అలర్ట్.. నడక మార్గంలో మరో 3 చిరుతలు!