Site icon HashtagU Telugu

Half Day Schools : తెలంగాణలో ఒంటిపూట బడులు ఎప్పటి నుంచి అంటే..

Half Day Schools

Half Day Schools

Half Day Schools : తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ఈసారి సమ్మర్ సీజన్ చాలా హాట్‌గా ఉంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చెబుతోంది. ఈనేపథ్యంలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు  నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ  నిర్ణయించింది. ఉద‌యం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వ‌ర‌కు బ‌డులను నిర్వహిస్తారు. ఈమేరకు పాఠశాలలకు ఒంటిపూట బ‌డుల‌పై విద్యాశాఖ ఆర్డర్స్ జారీ చేసింది. మే నెల మూడోవారం వరకు ఒంటిపూట బడులను(Half Day Schools) కొనసాగిస్తామని పేర్కొంది.  విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని మధ్యాహ్నం 12.30 గంటలకు అందజేస్తారు.

We’re now on WhatsApp. Click to Join

పదో తరగతి ఎగ్జామ్స్ ముగిసిన తర్వాత యథావిథిగా ఉదయం పూట తరగతులు నిర్వహించ నున్నారని తెలంగాణ విద్యాశాఖ చెప్పింది. ఈ విద్యా సంవత్సవంలో చివరి పని దినం ఏప్రిల్ 23.  ఒంటి పూట బడుల్లో భాగంగా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఉన్నత పాఠశాలలు అంటే ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పాఠశాలలు పనిచేస్తాయి. తెలంగాణలో పదోతరగతి విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకుగానూ మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు ప్రత్యేక తరగతులను నిర్వహించనున్నారు.  పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన తర్వాత పరీక్ష జరిగే కేంద్రాల్లో మధ్యాహ్నం తరగతులు నిర్వహిస్తారు. పదో తరగతి విద్యార్థులకు పరీక్షల అనంతరం వేసవి సెలవులపై ప్రకటన చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.

Also Read : Madhavi Latha vs Owaisi : అసదుద్దీన్‌తో ఢీ.. బీజేపీ అభ్యర్థి మాధవీలత ఎవరో తెలుసా ?