LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

తెలంగాణలోని ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు పౌరసరఫరాల శాఖ అలర్ట్ జారీ చేసింది. గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తమ బయోమెట్రిక్ అథెంటికేషన్ ప్రక్రియను ఈ నెలాఖరు (జూన్ 30) లోపు ఖచ్చితంగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లేదంటే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలో కోత విధించనున్నారు. గత ఏడాది కాలంగా ఈ-కేవైసీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతున్నప్పటికీ, ఇంకా చాలా మంది వినియోగదారులు దీనిని పూర్తి చేయకపోవడంతో ప్రభుత్వం ఈసారి తుది గడువును విధిస్తూ కఠిన […]

Published By: HashtagU Telugu Desk
Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

తెలంగాణలోని ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు పౌరసరఫరాల శాఖ అలర్ట్ జారీ చేసింది. గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తమ బయోమెట్రిక్ అథెంటికేషన్ ప్రక్రియను ఈ నెలాఖరు (జూన్ 30) లోపు ఖచ్చితంగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లేదంటే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలో కోత విధించనున్నారు. గత ఏడాది కాలంగా ఈ-కేవైసీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతున్నప్పటికీ, ఇంకా చాలా మంది వినియోగదారులు దీనిని పూర్తి చేయకపోవడంతో ప్రభుత్వం ఈసారి తుది గడువును విధిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. అక్రమ గ్యాస్ కనెక్షన్లకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయడంతో పాటు, అర్హులైన వారికే ప్రభుత్వ రాయితీలు చేరేలా చూడటం, నిధుల దుర్వినియోగాన్ని నిరోధించడమే లక్ష్యంగా ఈ డిజిటల్ ధృవీకరణను ప్రవేశపెట్టారు.

ఈ ప్రక్రియలో భాగంగా గ్యాస్ కనెక్షన్లను వినియోగదారుల అధికారిక గుర్తింపు పత్రాలతో అనుసంధానం చేస్తారు. దీనికోసం ప్రధానంగా మూడు రకాల ఆధునిక సాంకేతిక విధానాలను అందుబాటులోకి తెచ్చారు. వినియోగదారులు ముఖ గుర్తింపు, వేలిముద్రలు లేదా ఐరిస్ విధానాల ద్వారా తమ ఈ-కేవైసీని విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. వినియోగదారుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ-కేవైసీని పూర్తి చేయడానికి పౌరసరఫరాల శాఖ నాలుగు సులువైన మార్గాలను వెల్లడించింది.

వినియోగదారులు ఎక్కడికీ వెళ్లకుండానే నేరుగా సంబంధిత ఆయిల్ కంపెనీల అధికారిక మొబైల్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని ఇంట్లోనే ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు.

గ్యాస్ సిలిండర్ ఇంటికి డెలివరీ చేసే సమయంలోనే డెలివరీ బాయ్స్ వద్ద ఉండే బయోమెట్రిక్ పరికరాల ద్వారా ఈ ప్రక్రియను కొన్ని ఏజెన్సీలు స్పాట్‌లోనే పూర్తి చేస్తున్నాయి.

వినియోగదారులు నేరుగా తమ పరిధిలోని గ్యాస్ డీలర్ల కార్యాలయాలకు వెళ్లి అక్కడ అందుబాటులో ఉన్న బయోమెట్రిక్ మిషన్ల ద్వారా ఉచితంగా కేవైసీ చేసుకోవచ్చు.

బయోమెట్రిక్ పూర్తి చేయని వినియోగదారులను ఫోన్ కాల్స్ లేదా ఎస్ఎమ్ఎస్ ద్వారా సంప్రదించి, వారు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహించాలని సూచించారు.

ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు పొందిన లబ్ధిదారులు ఏడాదికి ఒకసారి విధిగా ఈ బయోమెట్రిక్ ఈ-కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

సిలిండర్ల బుకింగ్‌లు ఆపితే చర్యలు..

ఇదే సమయంలో వినియోగదారులకు ఊరటనిచ్చే మరో కీలక ఆదేశాన్ని కూడా పౌరసరఫరాల శాఖ జారీ చేసింది. ఈ-కేవైసీ ఇంకా పూర్తి కాలేదనే నెపంతో కొన్ని గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారుల కొత్త సిలిండర్ బుకింగ్‌లను నిరాకరిస్తున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చింది. ఈ చర్యను తీవ్రంగా తప్పుపట్టిన అధికారులు, ఈ-కేవైసీ పెండింగ్‌లో ఉన్నప్పటికీ సిలిండర్ల సరఫరాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపకూడదని డీలర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. బుకింగ్‌లను నిరాకరించడం నిబంధనలకు విరుద్ధమని, అలాంటి ఏజెన్సీలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వినియోగదారులు గడువు లోపు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 

  Last Updated: 17 Jun 2026, 01:23 PM IST