Hyderabad Police: హైదరాబాద్ లో పోలీసులు రెచ్చి పోతున్నారు. తప్పు చేసిన వారిని పట్టుకోవడం పక్కనపెడితే అమాయకుల మీద చేతివాటం ప్రదర్శిస్తున్నారు. మహిళలను వేదించే పోకిరీలను పట్టుకోకుండా రాత్రి సమయంలో రోడ్లపై కనిపించిన ప్రతి ఒక్కరిని వేధిస్తున్న ఘటనలు రోజు చోటు చేసుకుంటున్నాయి.ఇటీవల కాలంలో పాతబస్తీలో అనేక సంఘటనలు వెలుగు చూశాయి. యువతని అసభ్యకర పదజాలంతో తిడుతూ లాఠీ ఛార్జ్ చేస్తున్న పరిస్థితి. కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సైతం పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. పోలీసులా రౌడీలా అన్నట్టు ఉంది ఖాకీల ప్రవర్తన.
పాతబస్తీలో పోలీసుల వైఖరిపై హైకోర్టును ఆశ్రయిస్తామని, ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తామని ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల కోసం ఎవరైనా ఇంటి బయట నిలబడటం లేదా తిరగడం తప్పా అని ప్రశ్నించారు. అమాయకులు ఇళ్ల బయట ఉన్నా కూడా పోలీసులు లాఠీచార్జి చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే కోర్టులో పిఐఎల్ దాఖలు చేస్తాను అని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. బంజారాహిల్స్‌లోని పోలీస్ కమీషనర్ కార్యాలయం ముందు హోటల్ తెరిచి ఉంది. అయితే హోటల్ నుంచి లంచాలు వస్తున్నాయి కాబట్టి హోటల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవట్లేదా అంటూ మండిపడ్డారు.
లాఠీ కల్చర్‌ను అమలు చేయడంలో కమిషనర్ టాస్క్‌ఫోర్స్ సహకారాన్ని హైలైట్ చేస్తూ, వ్యవస్థీకృత నేరాలను నియంత్రించడానికి టాస్క్‌ఫోర్స్‌ను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. బదులుగా టాస్క్ ఫోర్స్ ప్రజలను రాత్రిపూట పడుకోమని బలవంతం చేయడంలో బిజీగా ఉంది అని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. పోలీసుల వైఖరి ఇలానే నేను కొనసాగితే పాతబస్తీలోనే నిలబడతానని, అప్పుడు జరిగే పరిణామాలను ప్రభుత్వమే ఎదుర్కోవాలని, అందుకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు.
నగరంలో పెరుగుతున్న నేరాల రేటును నియంత్రించాలని ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ ప్రభుత్వాన్ని కోరారు. పోలీసులు నేరస్తుల నుంచి మామూళ్లు వసూళ్లు చేస్తూ అమాయకులను పోలీసింగ్ పేరుతో చితక్కొడుతున్నారని అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ప్రతి పోలీస్ స్టేషన్‌కి మామూల్ వస్తుంది . నేను ఎవరికీ భయపడను. నేను ఈ విషయాన్ని బహిరంగంగా చెబుతున్నానని వ్యవస్థపై మండిపడ్డారు ఒవైసి.
Also Read: AP Government : ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏపీ సర్కార్ సిద్ధం..