Telangana Elections 2023: తగ్గిన అక్బరుద్దీన్ ఆస్తులు..పెరిగిన 90 మంది ఎమ్మెల్యేల ఆస్తులు

రాజకీయ నాయకుల ఆస్తులు పెరగడమే తప్ప తగ్గడం పెద్దగా జరగదు. ఎన్నికల అఫిఢఫిట్ లో చూపించిన లెక్కలకు, అసలు ఆస్తుల వివరాలకు చాలా బేధం కనిపిస్తుంటుంది. కాగా 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు 2023 ఎన్నికలకు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆస్తులు

Telangana Elections 2023: రాజకీయ నాయకుల ఆస్తులు పెరగడమే తప్ప తగ్గడం పెద్దగా జరగదు. ఎన్నికల అఫిఢఫిట్ లో చూపించిన లెక్కలకు, అసలు ఆస్తుల వివరాలకు చాలా బేధం కనిపిస్తుంటుంది. కాగా 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు 2023 ఎన్నికలకు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆస్తులు భారీగా తగ్గినట్లు ప్రకటించాడు. ఐదేళ్లలో ఆయన ఆస్తులు 22 శాతానికి పైగా తగ్గినట్లు తెలిపారు. అక్బరుద్దీన్ ఒవైసీ ఆస్తులు 2018లో 24 కోట్ల నుండి 2023 నాటికి 18 కోట్లకు తగ్గాయి.త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఈ నియోజకవర్గానికి ఐదోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1999లో తొలిసారి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అక్బరుద్దీన్ ఒవైసీ ఆస్తులు క్షీణించినప్పటికీ, గత ఐదేళ్లలో ఇతర ఎంఐఎం ఎమ్మెల్యేల ఆస్తులు భారీగా పెరిగినట్లు సమాచారం.అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా 90 మంది ఇతర ఎమ్మెల్యేల ఆస్తులు భారీగా పెరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 103 మంది ఎమ్మెల్యేలు తిరిగి 2023 అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. 2018లో ఎమ్మెల్యేల సగటు ఆస్థి విలువ 14 కోట్లు కాగా 2023లో అది 23 కోట్లకు చేరింది.

Also Read: Banana Vs Foods : అరటిపండుతో ఈ ఫుడ్స్ కలిపి తినొద్దు