Hydra Demolition: హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం ద్వంద వైఖరి ప్రదర్శిస్తుంది. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసి హైడ్రా కూల్చివేతలపై స్పందించాడు. ప్రభుత్వ కార్యాలయాలను, అలాగే నెక్లెస్ రోడ్డును కూడా కూల్చివేస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే తాజాగా అసెంబ్లీ ఫ్లోర్ లీడర్, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హైడ్రా కూల్చివేతలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందన్న వార్తలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు. తాను స్థాపించిన సంస్థల కూల్చివేతకు వాదిస్తున్న వారిని విమర్శించారు.
అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ఎంఐఎం విద్యార్థులకు విద్య అందించడం ద్వారా కొంతమందిలో అసూయను రేకెత్తిస్తున్నాయి అని అక్బరుద్దీన్ మండిపడ్డారు. నిరుపేదల కోసం తాను చేస్తున్న ప్రయత్నాలను అణగదొక్కాలని నిర్ణయించుకున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఒవైసీ అక్రమ భూమిని ఆక్రమించాడా అనేది ఖచ్చితంగా తెలియనప్పటికీ రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పేదలకు ఉచిత విద్యను అందించేందుకు 12 బిల్డింగ్‌లు నిర్మించానని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. ఏవీ రంగనాథ్ నేతృత్వంలోని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ఏజెన్సీ అక్బరుద్దీన్ ఒవైసీకి చెందిన ఆస్తుల గురించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ కొందరు కావాలనే తమపై విషం కక్కుతున్నట్లు ఆయన తెలిపారు.
తన ప్రత్యర్థులను ఖండిస్తూ“ఎవరైనా నాతో శత్రుత్వం కలిగి ఉంటే, వచ్చి నన్ను కత్తులు మరియు తుపాకీలతో చంపండి. కానీ నా మంచి పనిని ఆపడానికి ప్రయత్నించవద్దు అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేశారు అక్బరుద్దీన్. గతంలో అనేక దాడుల నుండి బయటపద్దానని చెప్పాడు. “నాపై కత్తులతో దాడి చేయండి, కానీ మంచి పనిని నాశనం చేయవద్దు,” అని ఆయన అభ్యర్ధించారు. గతంలో జరిగిన దాడుల మచ్చలను భరించిన ఒవైసీ.. తాను ఎప్పుడూ తన శత్రువులను ధీటుగా ఎదుర్కొంటానని ఉద్ఘాటించారు. ఇదే వ్యవహారంలో అతని సోదరుడు అసదుద్దీన్ ఒవైసి కూడా స్పందించారు. బఫర్ జోన్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను, అలాగే నెక్లెస్ రోడ్డును కూడా కూల్చివేస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు
ఇదిలా ఉండగా హైడ్రా నగరంలోని ఎఫ్‌టిఎల్ భూములు మరియు సరస్సుల బఫర్ జోన్‌లలో నిర్మించిన భవనాలపై కూల్చివేతలను నిర్వహిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) పరిధిలో ఆక్రమణకు గురైన భూముల్ని స్వాధీనం చేసుకుంటున్నది. హైడ్రా త్వరలో మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం కనిపిస్తుంది. హైడ్రా టార్గెట్ రాజకీయ నాయకుల అక్రమాలపైనేనని కొందరు భావిస్తున్నారు.
Also Read: LRS : ఎల్ఆర్ఎస్ ఫీజు వసూళ్లపై సీఎం రేవంత్ కు హరీష్ రావు లేఖ