Site icon HashtagU Telugu

5G in Hyderabad: గుడ్ న్యూస్.. హైదరాబాద్లో 5జీ సేవలు ప్రారంభం

5g Phones

5g Phones

భారతదేశంలోని అగ్రశ్రేణి టెలికాం కంపెనీలలో ఒకటైన ఎయిర్‌టెల్ (Airtel) తన 5G సేవలను హైదరాబాద్‌లో కూడా ప్రారంభించింది. కంపెనీ దీనిని నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించింది. దీనికి ఒక రోజు ముందు కంపెనీ లక్నోలో ఎయిర్‌టెల్ (Airtel) 5G ప్లస్‌ను కూడా ప్రారంభించింది. హైదరాబాద్ వాసులు ఇప్పుడు మెట్రోలో కూడా హైస్పీడ్ 5జీ సేవలను వినియోగించుకోవచ్చని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ తెలిపింది.

హైదరాబాద్‌లో 5జీ సేవలను ప్రారంభించినట్లు ఎయిర్‌టెల్ తెలిపింది. నగరంలోని పలు ముఖ్య ప్రదేశాలతో పాటు మెట్రో, రైల్వే స్టేషన్స్, బస్ టర్మినల్స్ వంటి రవాణా కేంద్రాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. రానున్న కాలంలో నగరం మొత్తం 5జీ విస్తరిస్తామని తెలిపింది. కాగా హైదరాబాద్‌లో జియో ఇంకా 5జీని ప్రారంభించలేదు.

Also Read: Dhanurmasam : ధనుర్మాసం అంటే ఏమిటి? ధనుర్మాసం ప్రత్యేకత ఏంటి?

హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తెలంగాణలోని అతిపెద్ద ఇంటర్‌స్టేట్ బస్ టెర్మినల్ (ISBT) ఇమ్లిబన్ బస్ డిపోలో అలాగే సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్‌లలో ప్రజలు ఎయిర్‌టెల్ అల్ట్రా-ఫాస్ట్ 5G కనెక్టివిటీని ఆస్వాదించవచ్చని Airtel పేర్కొంది. వెస్ట్రన్ సిటీ, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, బోయిన్ పల్లి, కొంపల్లితో పాటు ఉప్పల్, నాగోల్ వంటి పలు ఏరియాల్లోని ప్రజలు కూడా ఎయిర్ టెల్ 5జీ నెట్ వర్క్ ను వినియోగించుకోవచ్చని తెలిపారు.

Exit mobile version