Site icon HashtagU Telugu

Air Show : ట్యాంక్ బండ్‌పై ముగిసిన ఎయిర్ షో.. ఆకట్టుకున్న వైమానిక విన్యాసాలు

Air Show

Air Show

Air Show : కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే నేడు ప్రజాపాలన విజయోత్సవాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా, ఆదివారం హూస్సేన్‌సాగర్ వద్ద ఎయిర్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు , పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ప్రదర్శనను తిలకించారు. ఎయిర్‌ షో నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌ ప్రాంతం మొత్తం సందడిగా మారిపోయింది. సుమారు 25 నిమిషాల పాటు జరిగిన ఈ ఎయిర్‌ షోలో వైమానిక దళానికి చెందిన 9 సూర్యకిరణ్‌ విమానాలు ప్రదర్శనలు ఇచ్చాయి. ఈ విన్యాసాలు ప్రజలను ఆకట్టుకున్నాయి, కాగా ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో సందడిని కలిగించాయి.

అలాగే, సాయంత్రం సమయంలో ప్రజా విజయోత్సవాల్లో భాగంగా నెక్లెస్ రోడ్ , హెచ్ఎండీఏ గ్రౌండ్స్ సమీపంలో పలు స్టాళ్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ స్టాళ్లను ప్రముఖ సినీ తారలు సందర్శించి సందడి చేయనున్నారు. ‘లక్కీ భాస్కర్’ సినిమా సహా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన మీనాక్షి చౌదరి, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో పాపులర్ అయిన అంజలి తదితర సినీ ప్రముఖులు ఈ స్టాళ్లను సందర్శిస్తారు. తరువాత, వారు హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన హ్యాండ్ క్రాఫ్ట్స్ , ఫుడ్ స్టాళ్లను కూడా సందర్శిస్తారు

అంతేకాక, ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 5 గంటల నుంచి 6 గంటల వరకు వడ్డే శంకర్ బృందం పాటలు పాడి శ్రోతలను అలరించనున్నారు. 6 గంటల నుంచి 6:45 గంటల వరకు నీలా అండ్ టీమ్ బోనాలు , కోలాటం ప్రదర్శన ఇవ్వనున్నారు. తరువాత, 6:45 గంటల నుంచి 8 గంటల వరకు మోహిని అట్టం, భరతనాట్యం, థియేటర్ స్కిట్ ప్రదర్శనలు ఉండనున్నాయి. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు రాహుల్ సిప్లిగంజ్ అండ్ టీమ్ మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నారు. అయితే.. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రేక్షకులు పాల్గొంటారని అంచనా.

Read Also : Sama Ram Mohan Reddy: వంచన కేసీఆర్ కుటుంబం పెటెంట్… వారు తప్ప ఎవరూ చేయలేరు