హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోటా(Hyderabad local bodies MLC election)లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం విజయం (AIMIM wins ) సాధించింది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పన్వర్ హాల్‌లో గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. గంట వ్యవధిలోనే ఫలితాలు వెల్లడయ్యాయి. ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్(Mirza Riyaz Ul Hasan)కు 63 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి డాక్టర్ గౌతమ్ రావు(Gautham Rao)కు కేవలం 25 ఓట్లు మాత్రమే రావడంతో ఎంఐఎం అభ్యర్థి ఘన విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు.
Oily Skin: వేసవికాలంలో చర్మం జిడ్డుగా కనిపిస్తోందా.. అయితే ఇవి ట్రై చేయాల్సిందే!
బుధవారం జరిగిన పోలింగ్‌లో మొత్తం 112 ఓటర్లలో 88 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. బ్యాలెట్ విధానంలో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత క్రమం ప్రకారం ఓట్లను లెక్కించారు. ముఖ్యంగా కాంగ్రెస్ సభ్యుల ఓట్లు ఈ పోరులో కీలకంగా మారాయి. బీఆర్‌ఎస్ పార్టీ సభ్యులు మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు, ఇది ఎన్నిక ఫలితంపై ప్రభావం చూపిన అంశాలలో ఒకటి.
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫలితాలు వెల్లడైన తర్వాత ఎంఐఎం శ్రేణులు ఉత్సాహంగా స్పందించాయి. పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించడంపై పార్టీ అధిష్ఠానం ఆనందం వ్యక్తం చేసింది. బీజేపీ తరపున పోటీ చేసిన అభ్యర్థికి పరాజయం ఎదురవడం పట్ల పార్టీ నేతలు నిరాశ వ్యక్తం చేశారు. మొత్తంగా ఈ ఎన్నికల ఫలితం, స్థానిక రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.