Akbaruddin Owaisi: తెలంగాణాలో రానున్న ఎన్నికల నేపథ్యంలో ఏఐఎంఐఎం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇన్నాళ్లు కొన్ని స్థానాలకే పరిమితమైన మజ్లీస్ రానున్న ఎన్నికల్లో పార్టీని విస్తరించేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అక్బరుద్దీన్ ఒవైసీ కుమారుడు నూరుద్దీన్ ఒవైసీని బరిలోకి దించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నూరుద్దీన్ ఒవైసీని బరిలోకి దింపాలని భావించారు. అయితే వయసు రీత్యా అది కుదరలేదు. అయితే ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నూరుద్దీన్ ఒవైసీని బరిలోకి దించడం ఖాయంగా కనిపిస్తుంది. నూరుద్దీన్ ఒవైసీ ఎంబీబీస్ పూర్తి చేశాడు.
తెలంగాణాలో గత అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS), భారత జాతీయ కాంగ్రెస్ (INC), మరియు భారతీయ జనతా పార్టీ (BJP) ప్రధాన పార్టీలు పాల్గొన్నాయి. 119 స్థానాలకు గాను 88 స్థానాల్లో అప్పటి టీఆర్ఎస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఎన్నికల్లో ఏఐఎంఐఎం ఏడు సీట్లను గెలుచుకుంది. ఇదిలా ఉండగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని 119 సీట్లలో కనీసం 50 స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తున్నట్లు పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ గతంలో చెప్పారు.
Read More: Indias Debt Explained : మోడీ హయాంలో రూ.100 లక్షల కోట్ల అప్పు