Kaleshwaram : `మేఘా` రూ. 12వేల కోట్ల జీఎస్టీ స్కామ్: ఏఐసీసీ నేత జ‌డ్స‌న్

కాళేశ్వ‌రం నిర్మించిన మేఘా కృష్ణారెడ్డి సుమారు రూ. 12వేల కోట్ల జీఎస్టీ ఎగ‌వేత అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆ మేర‌కు ప‌లు ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు ఏఐసీసీ మెంబ‌ర్ బ‌క్కా జ‌డ్స‌న్ ఫిర్యాదు చేశారు.

  • Written By:
  • Updated On - August 14, 2022 / 10:46 AM IST

కాళేశ్వ‌రం నిర్మించిన మేఘా కృష్ణారెడ్డి సుమారు రూ. 12వేల కోట్ల జీఎస్టీ ఎగ‌వేత అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆ మేర‌కు ప‌లు ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు ఏఐసీసీ మెంబ‌ర్ బ‌క్కా జ‌డ్స‌న్ ఫిర్యాదు చేశారు. వాటి వివ‌రాల‌ను మీడియాముఖంగా శ‌నివారం ఆయ‌న బ‌య‌ట‌పెట్టారు. ఈడి, సిబిఐ, కాగ్ కేంద్ర సంస్థ‌ల‌కు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, క్యాసినో కింగ్ చిక్కోటి ప్ర‌వీణ్ ఆధ్యాత్మిక‌వేత్త త్రిదండి చిన్నా జీయర్ సంబంధంల‌పై ద‌ర్యాప్తు చేయాల‌ని డిమాండ్ చేశారు. మ‌నీ ల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డ్డార‌ని ఆరోపిస్తూ ఆయా ద‌ర్యాప్తు సంస్ధ‌ల‌కు ఇచ్చిన ప‌త్రాల‌ను బ‌ట‌య‌పెట్టారు. సుమారు రూ. 12వేల‌ కోట్ల జీఎస్టి ఎగవెతపై CAGకు తాజాగా ఆయ‌న ఫిర్యాదు చేశారు.

గోదావరి వరద ఉధృతికి అల్లకల్లోలమైంది.ఎస్సి /ఎస్టి సబ్ ప్లాన్ నిధులు 1.15 కోట్లు దారిమల్లించి  కాళేశ్వరం ద్వారా మేఘా నుండి కల్వకుంట్ల ఖాజనాకు చేరాయ‌ని ఆరోపించారు. నీటిని లిఫ్ట్ చేసే కన్నెపల్లి, దానికి పైనున్న అన్నారం పంపుహౌస్‌‌లు పూర్తిగా మునిగిపోయాయి. రెండు పంపుహౌసుల్లో కలిపి 29 బాహుబలి మోటార్లు, వాటిని ఆపరేట్‌‌ చేయాల్సిన ఎలక్ట్రో మెకానికల్‌‌ ఎక్విప్‌‌మెంట్‌‌, కంట్రోల్‌‌ ప్యానళ్లు, కంప్యూటర్లు, రెండు భారీ ఎయిర్‌‌ కండిషన్‌‌ సిస్టమ్​లు, రెండు స్కాడా సిస్టమ్​లు, సబ్‌‌ స్టేషన్లు ఇట్లా అన్నీ వరదలో కనిపించకుండాపోయాయి. దీంతో వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇందుకు డిజైన్, మెయింటనెన్స్​ లోపాలే ప్రధాన కారణమని రిటైర్డ్​ ఇంజనీర్లు అంటున్నారు.

2017 ఎక్సజ్ & ప్రోహిబిషన్ సిట్ ను నియమించి నెల రోజుల పాటు సినిమా ప్రముఖులను ఇంట‌రాగేష‌న్‌ చేసి. సినిమా పరిశ్రమను తన గుప్పింట్లో పెట్టొకోవడానికి వాళ్ళను బ్లాక్ మెయిల్‌ చేసి అ కేసును మూసేసే ప్రయత్నం చేసార‌ని జ‌డ్స‌న్ అనుమానించారు.   రాష్ట్రంలో డ్రగ్స్ కేసులో మంత్రి కేటీఆర్ కు ప్రమేయం ఉందని ED కి ఫిర్యాదు ఇవ్వడంతో హడావుడిగా ఎక్సజ్ & ప్రోహిబిషన్ రంగారెడ్డి జిల్లా కోర్ట్లో సినీ తరల క్లీన్ చిట్ ఇవ్వడానికి ఛార్జ్ షీట్ ఫైల్ చేసార‌ని అన్నారు. సినీ ప్రముఖులను దర్యాప్తు చెయ్యడం శ‌నివారం ముగుస్తుంది. మంత్రి కేటీఆర్ ను కాపాడటానికి ఈ త‌తంగం నడిపారని ED కి తెలిపారు. అయిన ఇప్పటి కి చర్యలు లేవు. తాజాగా క్యాసినో జూదం లో తెలంగాణ మంత్రులు, ఎమ్ఎల్ఏ లు వారితో సహా ఆధ్యాత్మిక గురువు చిన్నజీయర్ స్వామి, చిక్కోటి ప్రవీణ్ కుమార్ పక్కన కూర్చొని కారులో ఉన్నార‌ని వివ‌రించారు. చిక్కోటి ప్రవీణ్ కుమార్ తో సంబంధలపై కేటీర్, కవిత లతో చిన్నజీయర్ స్వామి విచారణ చెయ్యాలని ఈడి కి ఫిర్యాదు చేశారు. ఈడి బీజేపీ అనుబంధ సంస్థ లాగా కాకుండా నిజమైన ప్రజ చట్ట వ్యవస్థ లెక్క పని చెయ్యాల‌ని కోరారు. ఆయ‌న మీడియా స‌మావేశంలోని ముఖ్య అంశాలు

#కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కొక్కటిగా నిర్మాణ లోపాలు అసెంబ్లెడ్ నాణ్యత లేని  మోటార్లలో 10,000 కోట్ల కుంబకోణం. బయట పడుతున్నాయి :

#2019 ఆగస్టులో లక్ష్మీపూర్‌‌‌‌‌‌‌‌ పంప్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌ ప్రొటెక్షన్‌‌‌‌ ‌‌‌‌వాల్‌‌‌‌ ‌‌‌‌దెబ్బతిని నీళ్లు లీకయ్యాయి.

#అదే ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 3న కన్నెపల్లి పంప్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌ ప్రొటెక్షన్‌‌‌‌ వాల్‌‌‌‌ దెబ్బతిని మోటార్లపైకి నీళ్లు చేరాయి.

# మూడో టీఎంసీ పనులు చేస్తున్న టైంలోనూ ప్రొటెక్షన్‌‌‌‌ ‌‌‌‌వాల్‌‌‌‌‌‌‌‌ దెబ్బతింది.

# 2019 అక్టోబర్‌‌‌‌ 9న అన్నారం బ్యారేజీ గేట్లలో లీకేజీలు ఏర్పడ్డాయి.

# 2020 ఆగస్టు 23న కొద్దిపాటి వర్షాలకే కాళేశ్వరం దగ్గర గ్రావిటీ కెనాల్‌‌‌‌‌‌‌‌ లైనింగ్‌‌‌‌‌‌‌‌ కూలింది.

# మిడ్‌‌‌‌ మానేరు నింపడంలో ప్రొటోకాల్‌‌‌‌ పాటించకపోవడంతో 2019 సెప్టెంబర్‌‌‌‌లో ఆ ప్రాజెక్టు కట్టకు బుంగ పడింది.

#అన్నారం పంపుహౌస్‌‌‌‌ నుంచి నీటిని సరఫరా చేసే పైపులైన్‌‌‌‌ నిరుడు జులై 28న భారీ వర్షాలతో భూమిలోంచి పైకితేలింది.

# నిరుడు సెప్టెంబర్‌‌‌‌ 27న సుందిళ్ల బ్యారేజీ కట్ట దెబ్బతింది.

#కొండపోచమ్మసాగర్‌‌‌‌ లో నిర్మించిన వాకోవర్‌‌‌‌ బ్రిడ్జి 2020 ఆగస్టు 30న కూలిపోయింది.

# అదే ఏడాది జులై 7న రంగనాయకసాగర్‌‌‌‌ డెలివరీ సిస్టర్న్‌‌‌‌ వద్ద రివిట్‌‌‌‌మెంట్‌‌‌‌ దెబ్బతింది.

#ఇక్కడి నుంచి యాదాద్రి జిల్లాకు నీళ్లు తరలించే గ్రావిటీ కెనాల్‌‌‌‌ 2020 జూన్‌‌‌‌ 30న తెగింది.

# అదే ఏడాది జూన్‌‌‌‌ 6న భారీ వర్షాలకు కొండపోచమ్మ పంపుహౌస్‌‌‌‌ కట్ట దెబ్బతింది.

# 2020 జూన్‌‌‌‌ 13న మల్లన్నసాగర్‌‌‌‌ గ్రావిటీ కాల్వకు గండిపడి ఎర్రవల్లి గ్రామంలోని పంట భూములు నీట మునిగాయి.

# ఎస్సారెస్పీకి భారీ వరద ముంచెత్తడంతో 2021 సెప్టెంబర్‌‌‌‌ 13న నిజామాబాద్‌‌‌‌ జిల్లాలోని పంపుహౌస్‌‌‌‌ మునిగిపోయింది.

15) ఇప్పుడు భారీ వరదలకు కన్నెపల్లి, అన్నారం పంప్​హౌస్​లు మునిగిపోయాయి.

కాబట్టి కాళేశ్వరం భారీ ప్రాజెక్టు డిజైన్, మెయింటనెన్స్​ లోపాల వల్ల బాహుబలి మోటార్ల మునగడం పై మేఘ కన్స్ట్రక్షన్ పై సిబిఐ మరియు నీటియోగ్ కు, కాగ్  ఫిర్యాదు చేసాము. సిబిఐ, కార్యాలయానికి వచ్చిన వారిలో,  అసంఘాటీత కార్మిక కాంగ్రెస్ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, నాయకులు దుగ్యల వేణు, ప్రశాంత్,సాయిలు, శ్రీనివాస్, తదితరులు  పాల్గొన్నారు.

ఇట్లు. బక్క జడ్సన్, ఏఐసీసీ సభ్యులు