తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో తీపి కబురు అందించింది. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న 7 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సరికొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలలో స్టేట్ లెవెల్ క్యాడర్‌లో 2 పోస్టులు, అలాగే మల్టీ జోనల్ క్యాడర్‌లో 5 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 15వ తేదీ నుండి ఆగస్టు 22వ తేదీ వరకు ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బి.ప్లానింగ్ (B.Planning) లేదా బీటెక్ ప్లానింగ్ (BTech Planning) డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తుదారుల వయస్సు 18 ఏళ్ల నుండి 44 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹51,320 నుండి Rs.1,27,310 వరకు ఆకర్షణీయమైన జీతభత్యాలు లభిస్తాయి. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం, దరఖాస్తు ప్రక్రియ కొరకు అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in ను సందర్శించవచ్చు.
