AI Global Summit : తెలంగాణా ప్రగతిలో ఏఐ కూడా భాగస్వామ్యం: సీఎం రేవంత్‌ రెడ్డి

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కృత్రిమ మేధా పరిజ్ఞానాన్ని ఉపయోగించటానికి, పరిశోధనలను ప్రత్సహించటానికి, ఏఐ పర్యావరణాన్ని ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ భాగస్వాములతో కలసి పనిచేసేందుకు సిధ్ధంగా ఉన్నట్లు చెప్పారు.

Published By: HashtagU Telugu Desk
Ai Is Also A Partner In Tel

AI is also a partner in Telangana progress: CM Revanth Reddy

International AI Global Summit: హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో నేడు, రేపు అంతర్జాతీయ AI గ్లోబల్ సమ్మిట్‌ జరుగనుంది. ఈ మేరకు ఉదయం హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ లో ప్రపంచ కృత్రిమ మేధో సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు లాంచనంగా ప్రారంభించారు. ప్రతి ఒక్కరి కోసం ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ అన్న ఇతివృత్తంతో రెండురోజులు జరిగే ఈ సదస్సును రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కృత్రిమ మేధా పరిజ్ఞానాన్ని ఉపయోగించటానికి, పరిశోధనలను ప్రత్సహించటానికి, ఏఐ పర్యావరణాన్ని ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ భాగస్వాములతో కలసి పనిచేసేందుకు సిధ్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఏఐ సిటీ లోగోను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తెలంగాణాలో ఏఐ డెవలప్మెంట్ కు 25 అంశాలతో రోడ్ మ్యాప్‌ను సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు.

ఏఐ పై సీఎం రేవంత్ రెడ్డి విజన్..

తెలంగాణా ప్రగతిలో ఏఐ కూడా భాగస్వామ్యం అవుతుందని ఈ మేరకు అనేక అంశాలపై తన విజన్ ను సీఎం రేవంత్ తెలియజేశారు. వచ్చే 5 ఏళ్ళలో కోటి మందికి ఏఐ సేవలు అందించనున్నట్లు తెలియజేశారు. విద్యా, వ్యవసాయం, ఆరోగ్యం, పరిశ్రమల వంటి రంగాలలో ఉత్పాదకతను మెరుగు పరిచే ఏఐ గురించిన పరిజ్ఙానాలు, వివిధ రంగాలపై ఏఐ ప్రభావం వంటి పలు అంశాలను ఈ సదస్సులో లోతుగా చర్చిస్తున్నారు.

అంతకు ముందు రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కృత్రిమ మేధ ఉపయోగానికి, ఏఐ అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రజాస్వామ్య పద్దతులకు కట్టుబడి ఉంటూనే, ఏఐ వినియోగంపై కచ్చితమైన నియంత్రణలు అమలు చేయాలని భావిస్తున్నట్లు, సంబంధిత సంస్ధలతో కలసి పనిచేస్తున్నట్లు చెప్పారు. నిరంతర ఆర్ధిక అభివృద్దికోసం ఏఐను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న సంవత్సరాలలో రాష్ట్రం ఒక ట్రిలియన్ ఆర్ధిక శక్తిగా ఎదగాలని కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

పలు ఏఐ సంస్ధలతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకున్న సర్కార్..

రాష్ట్రాన్ని ఏఐ బేస్డ్ పవర్ గా తీర్చిదిద్దనున్నట్లు, హైదరాబాద్ లో ఏఐ సిటీ ఉత్తమ పరిశోధనా, సృజనాత్మక ప్రోత్సాహకంగా పని చేస్తుందనీ మంత్రి చెప్పారు. ఏఐ సిటీలో ఏఐ స్కూల్ ఆఫ్ ఎక్సెలెన్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి డిపార్ట్ మెంటులో ఒక ఏఐ ఏజెంటు ను నియమించటం చేస్తామన్నారు. పాఠశాల విద్యలో ఏఐ ను ప్రవేశపెట్టటం కూడా రోడ్ మ్యాప్ లో భాగమన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పలు ఏఐ సంస్ధలతో భాగస్వామ్య ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది.

Read Also: Friday: శుక్రవారం రోజు లక్ష్మిదేవిని ఈ పూలతో పూజిస్తే చాలు.. ఇంట్లో తిష్ట వేయడం ఖాయం!

 

 

  Last Updated: 05 Sep 2024, 03:32 PM IST