Site icon HashtagU Telugu

Agni V – Hyderabad : ‘అగ్ని-5’ మిస్సైల్ పురిటిగడ్డ మన హైదరాబాదే

Agni V Hyderabad

Agni V Hyderabad

Agni V – Hyderabad : చైనా, పాకిస్తాన్‌లకు భారత్ చుక్కలు చూపించింది. భారత్  నిర్వహించిన అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంతో ఆ రెండు దేశాలకు చెమటలు పట్టడం మొదలైంది.  5వేల కిలోమీటర్లకు పైగా దూరంలోని శత్రు లక్ష్యాలను ఛేదించగల అగ్ని-5 క్షిపణి అణ్వాయుధాలను కూడా తనతో మోసుకెళ్లగలదు.  అందుకే ఆ రెండు దేశాలకు అంతగా భయం కలుగుతోంది.  యావత్ పాకిస్తాన్‌ను, చైనాలోని చాలా కీలకమైన నగరాలను మన అగ్ని-5 క్షిపణి కొన్ని క్షణాల్లోనే చేరుకొని విధ్వంసం క్రియేట్ చేయగలదు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన అగ్ని-5 క్షిపణి తయారీలో మన హైదరాబాద్‌‌కు చెందిన పలు రక్షణ రంగ సంస్థలు కూడా కీలక పాత్ర పోషించాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

హైదరాబాద్(Agni V – Hyderabad) నగరంలో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)కు కొన్ని కీలకమైన అనుబంధ సంస్థలు ఉన్నాయి. వాటిలో అత్యంత ముఖ్యమైనవి రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ), అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లాబొరేటరీ (ఏఎస్ఎల్). ఈ రెండు సంస్థల్లో సేవలందించే శాస్త్రవేత్తలు అగ్ని-5 మిస్సైల్‌ తయారీ, డిజైనింగ్‌కు సంబంధించిన కార్యకలాపాల్లో ముఖ్యమైన సహాయ సహకారాలను అందించారు. ఆ క్షిపణి తయారీ ప్రక్రియ, డిజైనింగ్, పరీక్ష నిర్వహించే దశల్లో ఈ రెండు లేబొరేటరీల పాత్ర కీలకమైంది.

Also Read : Former CMs Children : ఆ స్థానం నుంచి మాజీ సీఎంల ఫ్యామిలీలు ఢీ.. పోటీ రసవత్తరం

సోమవారం విజయవంతంగా పరీక్షించిన అగ్ని-5 క్షిపణిలో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్‌వీ) అనే అత్యాధునిక టెక్నాలజీని వాడారు. ఎంఐఆర్‌వీ టెక్నాలజీని డెవలప్ చేయడంలోనూ హైదరాబాద్‌లోని వివిధ డీఆర్‌డీ‌ఓ యూనిట్లలో పనిచేసే శాస్త్రవేత్తలు ముఖ్య పాత్రను పోషించారు. వీటన్నింటి కంటే అత్యంత  ప్రధానమైన విషయం  ఏమిటో తెలుసా ? అగ్ని-5 క్షిపణిని మన హైదరాబాద్‌లోని ‘డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్‌’లోనే డెవలప్ చేశారు.  సిటీలో ఉన్న ‘డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్‌’లోనే రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ), అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లాబొరేటరీ (ఏఎస్ఎల్), డిఫెన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేబొరేటరీ (డీఆర్‌డీఎల్) ఉన్నాయి.

Also Read :Atlee Kumar: షారుఖ్ కాళ్లపై పడ్డ డైరెక్టర్ అట్లీ.. అసలేం జరిగిందంటే?

విశాఖ తీరానికి చేరువలో చైనా నిఘా నౌక

అణ్వస్త్రాలను మోసుకుపోయే సామర్థ్యం కలిగిన అగ్ని-5 క్షిపణి పరీక్షను ఒడిశా సమీపంలోని ఓ దీవిలో భారత్ సోమవారం విజయవంతంగా  నిర్వహించింది. అయితే సరిగ్గా ఆ సమయంలో చైనాకు చెందిన ఓ పరిశోధన నౌక భారత ప్రాదేశిక జలాలకు సమీపంలోకి రావడం కలకలం రేపింది.  చైనాకు చెందిన ‘జియాన్ యాంగ్ హాంగ్ 01’ నౌక ఏపీలోని విశాఖపట్నం తీరానికి 480 కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ సముద్ర జలాల్లో లంగరు వేసింది. భారత్ కు చెందిన మూడు అణు బాలిస్టిక్ మిసైల్ సహిత జలాంతర్గాములు, పలు కీలక ఆయుధ వ్యవస్థలకు స్థావరంగా ఉన్న విశాఖ నావల్ బేస్ కు సమీపానికి చైనా నౌక రావడంతో భారత్ అలర్ట్ అయింది. ‘జియాన్ యాంగ్ హాంగ్ 01’ నౌక  మలక్కా జలసంధి దాటి దిశ మార్చుకుని బంగాళాఖాతంలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. కేవలం మూడ్రోజుల వ్యవధిలోనే ఆగ్నేయ బంగాఖాతం నుంచి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. సముద్ర గర్భంలో 10 వేల అడుగుల లోతులోనూ పరిశోధించగల అత్యాధునిక రిమోట్ సెన్సింగ్ వ్యవస్థలు ఈ నౌకలో ఉన్నట్టు భావిస్తున్నారు. గత కొంతకాలంగా హిందూ మహా సముద్రం, బంగాళాఖాతంలో చైనా నౌకల రాకపోకలు ఎక్కువయ్యాయి. పరిశోధక నౌకల పేరిట భారత్ పై చైనా నిఘా వేస్తోందన్న అనుమానాలు ఉన్నాయి.

Exit mobile version