Site icon HashtagU Telugu

BJP and MIM: పాకిస్తాన్ తర్వాత పాతబస్తీనే టెర్రరిస్టులకు అడ్డా!

Bandi sanjay bus yatra

Bandi Padayatra

ఉగ్రమూకల (Terrorists) కదలికలతో హైదరాబాద్ (Hyderabad) లో ఆందోళనక పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల మధ్యప్రదేశ్ పోలీసులు 16 మందిని హిజాబ్- ఉత్-తాహిర్ టెర్రరిస్ట్ సంస్థతో లింకులు ఉన్నట్టు అరెస్ట్ చేస్తే అందులో 5 మంది హైదరాబాద్ కి చెందిన వాళ్లే ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ఎంఐఎం పార్టీపై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ అండదండలతో ఎంఐఎం పార్టీ హైదరాబాద్ పాత బస్తీ టెర్రరిస్టులకు ఒక సత్రంలా మార్చిందని ఆయన ఆరోపించారు. కేసిఆర్ ప్రభుత్వ చేతగానితనం వల్ల అక్రమంగా వచ్చిన ముస్లింలకు, రోహింగ్యాలకు తెలంగాణ ఒక సేఫ్ సిటీగా మారి ప్రజలకు టెర్రర్ రాష్ట్రంగా మారుతోందని బండి ఆవేదన వ్యక్తం చేశారు. మేం పాతబస్తీ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అన్న మాట మీద ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని, హైదరాబాద్ ను టెర్రర్ ఫ్రీ సిటీ చేసేదాకా #DoubleEngine సర్కార్ పోరాడుతుందని బండి సంజయ్ హెచ్చరించారు. ఓటు రాజకీయ కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎంఐఎంకు వత్తాసు పలుకుతున్నాయని మండిపడ్డారు.

ప్రత్యేక నిఘా

ఉగ్రమూకలు రాజధానిలోకి చొరబడ్డాయన్న వార్తలు తీవ్ర కలకలం రేపాయి. ఏకంగా మధ్యప్రదేశ్ పోలీసులు హైదారబాద్ కు వచ్చి తనిఖీలు చేయడం మరింతగా నగర వాసులను వణికించింది. ఈ మొత్తం వ్యవహారంలో హైదరాబాద్ లో తలదాచు కున్న రాడికల్ ఇస్లామిక్ కార్యకర్తలను భోపాల్ పోలీసులు (Police) అరెస్టు చేశారు. ఓ కేసులో భాగంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులతో కలిసి నిఘా పెట్టిన మధ్యప్రదేశ్ పోలీసులు 16 మందిని అరెస్టు చేశారు.

పోలీసుల దాడులు

అరెస్టైన వారిలో 11 మంది భోపాల్ ఐదుగురు హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి కత్తులు డాగర్లు ఇస్లామిక్ జిహాద్ సాహిత్యం సెల్ ఫోన్స్ (Cell Phones), హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు.. నగరంలో 18 నెలలుగా రాడికల్ ఇస్లామిక్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు తెలంగాణ (Telangana) ఇంటిలిజెన్స్ పోలీసులతో పాటు.. మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. నింది తులు ఉంటున్న ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇస్లామిక్ రాడికల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Also Read: Adipurush Offer: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ!