BRS Party: బీఆర్‌ఎస్‌కు విరాళాల వెల్లువ.. దేశంలోనే టాప్!

ప్రాంతీయ పార్టీల విరాళాల (Donations) అంశంలో బీఆర్ఎస్ టాప్‍ (Top)లో నిలిచింది.

  • Written By:
  • Publish Date - April 25, 2023 / 01:22 PM IST

ఇటీవల జాతీయ పార్టీగా ప్రమోషన్ పొందిన బీఆర్ఎస్ (BRS) తిరుగులేని క్రేజ్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే మహారాష్ట్ర గురి పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో కీలకంగా వ్యవహరించాలని అడుగులు వేస్తోంది. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పావులు కదుతుపున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాంతీయ పార్టీల విరాళాల (Donations) అంశంలో బీఆర్ఎస్ టాప్‍ (Top)లో నిలిచింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక విరాళాలు అందుకున్న పార్టీగా బీఆర్ఎస్ నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ దేశంలోనే టాప్ లో నిలిచాయి. దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీల్లో ఐదు రాజకీయ పార్టీలు మాత్రమే విరాళాల్లో అత్యధిక వాటా దక్కించుకున్నాయని ఎన్నికల సంస్కరణల కోసం పనిచేస్తున్న అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) వెల్లడించింది.

2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను 26 ప్రాంతీయ పార్టీలకు మొత్తం రూ.189.80 కోట్ల నిధులు విరాళాల కింద వచ్చాయని ఏడీఆర్ తెలిపింది. ఈ మొత్తంలో ఐదు పార్టీలకే రూ.162.21 కోట్లు (85 శాతం) విరాళాలు అందాయని వెల్లడించింది. ఈ ఐదు పార్టీల్లో .. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)లకు రూ.162.21 కోట్లు (85 శాతానికిపైగా) అందాయని ఏడీఆర్ తెలిపింది.

ప్రాంతీయ పార్టీల్లో (Local Parties) అత్యధిక విరాళాలు పొందిన రాజకీయ పార్టీగా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ పార్టీకి 2021–22లో 14 విరాళాల ద్వారా రూ.40.90 కోట్లు లభించాయి. రెండో స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఉంది. ఆప్ 2619 విరాళాల ద్వారా రూ.38.24 కోట్లు అందుకుని ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇక మూడో స్థానంలో రూ.33.26 కోట్లతో జేడీయూ రూ.29.80 కోట్లతో ఎస్పీ నాలుగో స్థానంలో రూ.20 కోట్లతో వైసీపీ అయిదో స్థానంలో నిలిచాయి.

Also Read: Trisha Krishnan: త్రిష గ్లామర్ సీక్రెట్ ఏంటో కానీ.. నలభైలోనూ వన్నె తరగని అందం!