Lok Sabha Poll : ప్రధాని మోడీ ఫై అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు

మన దేశ ప్రధాని మోడీ ఏక్ నిరంజన్. భార్యను కూడా ఏలుకోలేనోడు దేశాన్ని ఎలా ఏలుతాడో ఆలోచించి ఓటు వేయాలి. సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయుడ్ని భద్రాద్రి రామలయంలో పెట్టుకున్నాం

Published By: HashtagU Telugu Desk
Addanki Dayakar

Addanki Dayakar

లోక్ సభ (Lok Sabha) ఎన్నికల ప్రచారంలో అధికార – ప్రతిపక్షాల పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. రాజకీయా విమర్శల నుండి ఫ్యామిలీ ఫై విమర్శలు చేసే వరకు వెళ్తుంది. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్ కాస్త తీవ్ర పదజాలంతో మాట్లాడతారని అంత అనుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు ఆదిలాబాద్ లో జరిగిన జన జాతర సభలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ (Addanki Dayakar) సైతం సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏదో ఎమ్మెల్యే , ఎంపీ అభ్యర్థులపై కాదు ఏకంగా ప్రధాని మోడీ (PM Modi) , కేంద్ర మంత్రి అమిత్ షా (Amith Sha) ల ఫై కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

We’re now on WhatsApp. Click to Join.

మన దేశ ప్రధాని మోడీ ఏక్ నిరంజన్. భార్యను కూడా ఏలుకోలేనోడు దేశాన్ని ఎలా ఏలుతాడో ఆలోచించి ఓటు వేయాలి. సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయుడ్ని భద్రాద్రి రామలయంలో పెట్టుకున్నాం. కానీ మోడీ మాత్రం ఏడ్చే రాముడు, బాల రాముడు అని చెప్పి అయోద్యలో పెట్టాడు. దాని పక్కన బాబ్రీ మసీదు కట్టుకుంటుంటే ముస్లింల మీద విషం చిమ్ముతున్నారు. పాకిస్థాన్ పొమ్మంటే నా దేశం పాకిస్థాన్ కాదు. నేను ఈ దేశంలోనే పుట్టిన. ఈ దేశవాసిని అన్న ముస్లింలపై అక్కసు వెల్లగక్కుతున్నారు. మోడీ అనేవాడు చేతగాని దద్దమ్మ. అమిత్ షా అనే లఫూట్ గాడ్ని పక్కన పెట్టుకొని ఈ దేశాన్ని దోచుకుంటున్నాడు’ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న ఆశాభావాన్ని అద్దంకి దయాకర్ వ్యక్తం చేశారు. ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని, రేపు దేశంలో రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడమే మన ప్రథమ కర్తవ్యమన్నారు.

ప్రస్తుతం అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ప్రధానిని పట్టుకొని , దయాకర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు కరెక్ట్ అని అంత అంటున్నారు.

Read Also : Rajnath Singh: పీఓకే మనదే.. బలవంతం అవసరం లేదు: రాజ్ నాథ్ సింగ్

  Last Updated: 05 May 2024, 06:04 PM IST