Allu Arjun : సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట వ్యవహారంలో సినీనటుడు అల్లు అర్జున్ ఇవాళ ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. తన తండ్రి అల్లు అరవింద్, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డి, బన్నీ వాసులతో కలిసి చిక్కడపల్లికి చేరుకున్నారు. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై అల్లు అర్జున్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారని తెలిసింది. ఇటీవలే అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ పై కూడా ప్రశ్నలు అడుగుతారట. ఏసీపీ రమేశ్, ఇన్‌స్పెక్టర్ రాజునాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ఆయనకు ప్రశ్నలు వేస్తున్నారని సమాచారం. పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యే ముందు న్యాయ నిపుణులతో అల్లు అర్జున్ చర్చించారు.
Also Read :Lawrence Bishnoi : అమెరికాలో డ్రగ్స్ స్మగ్లర్ సునీల్ హత్య.. లారెన్స్ గ్యాంగ్ ఎందుకీ మర్డర్ చేసింది ?
అల్లు అర్జున్‌ను పోలీసులు అడిగే అవకాశమున్న ప్రశ్నలు
- సంధ్య థియేటర్ దగ్గర ఊరేగింపుగా ఎందుకు వెళ్లారు ?
- సంధ్య థియేటర్‌కు రావొద్దని థియేటర్ యాజమాన్యం మీకు ముందే చెప్పిందా?
- పోలీసుల అనుమతి లేదన్న మీకు ముందే తెలుసా.. తెలియదా?
- సంధ్య థియేటర్‌లో(Allu Arjun) ప్రీమియర్ షోకు వచ్చేందుకు అనుమతి పొందారా ?
- తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది?
- తొక్కిసలాట జరిగిన విషయాన్ని మీకు తొలుత ఎవరు చెప్పారు?
- ఏసీపీ చెప్పినప్పుడు థియేటర్ నుంచి మీరు ఎందుకు వెళ్లలేదు?
- తొక్కిసలాట గురించి తెలిసినా మీరెందుకు థియేటరులో సినిమా చూశారు?
- తగిన జాగ్రత్తలు తీసుకోవాలని థియేటర్ నిర్వాహకులకు మీరు ముందే చెప్పారా?
Also Read :Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు? కారణమిదే?
డిసెంబరు 4న రాత్రి పుష్ప 2 ప్రీమియర్స్ ప్రదర్శన నేపథ్యంలో అల్లు అర్జున్ హీరోయిన్ రష్మికతో పాటు సంధ్య థియేటర్‌కు వెళ్లారు. అల్లు అర్జున్ వచ్చాడని తెలిసి.. ప్రీమియర్ షోకు పెద్దసంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. దీంతో థియేటర్ లోపల తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ మృతి చెందింది. రేవతి తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీతేజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసులో అల్లు అర్జున్‌ను ఏ 11గా చేర్చారు. డిసెంబర్ 12న ఆయనను అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించగా నాలుగు వారాల మధ్యంతర బెయిల్ వచ్చింది. అయితే ఒకరోజు రాత్రి అల్లు అర్జున్ చంచల్ గూడ జైలులో గడపాల్సి వచ్చింది.