ACB Raids: మర్రిగూడ తహసీల్దార్ ఇంటిపై ACB దాడి, రెండు కోట్ల డబ్బు, కిలోలకొద్ది బంగారం లభ్యం!

మహేందర్ రెడ్డి ఇంటిలో కిలోల కొద్ది బంగారు నగలు, భారీగా ఆస్తిపత్రాలు దొరికాయి.

  • Written By:
  • Updated On - September 30, 2023 / 03:01 PM IST

ACB Raids: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణలతో తహసీల్దార్ ఇంటిపై దాడి చేయగా, లెక్కకు మించి నోట్లు బయటపడ్డాయి. ఈ ఘటన నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలో చోటుచేసుకుంది. తహశీల్ధార్ మంచిరెడ్డి మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు చేయడంతో ఒక ట్రక్కు పెట్టెలో రెండు కోట్లకు పైగా నగదు లభ్యమైనట్టు సమాచారం. మహేందర్ రెడ్డి ఇంటిలో కిలోల కొద్ది బంగారు నగలు, భారీగా ఆస్తిపత్రాలు దొరికాయి. అంతేకాదు మహేందర్ రెడ్డి కి సంబంధించిన 15 చోట్లలో ఐటీ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. మర్రిగూడ ఎమ్మార్వో ఆఫీస్ లో కూడా ఏసీబీ అధికారులు రైడ్స్ చేస్తున్నారు.

Also Read: E-mining App: అక్రమాల నివారణకు ఈ-మైనింగ్ మొబైల్ యాప్: మంత్రి మహేందర్ రెడ్డి