HMDA Director Shiva Balakrishna : ఏసీబీకి చిక్కిన భారీ అవినీతి అనకొండ..

  • Written By:
  • Updated On - January 25, 2024 / 11:06 AM IST

ఏసీబీ (ACB) అధికారులకు భారీ అవినీతి అనకొండ చిక్కింది..ఒకటి కాదు రెండు కాదు దాదాపు రూ.500 వందల కోట్లను ఈ అనకొండ మిగేసిందట. ప్రస్తుతం ఇంకా ఈ అనకొండ పొట్టలో ఇంకెన్ని కోట్లు ఉన్నాయో అని అధికారులు వెతుకుతున్నారు. ఓ పక్క ప్రభుత్వ జీతం తీసుకుంటూనే..మరోపక్క అడ్డదారులు తొక్కుతూ ప్రజల నుండి ‘లంచాల రూపంలో కోట్లాది రూపాయలు’ దండుకుంటూ ఆస్తులు పెంచుకుంటారు..పోనీ ఆలా పెంచుకున్న ఆస్తులకు సంపాదించి ప్రభుత్వానికి ఎలాంటి టాక్స్ లు కట్టకుండా బినామీల పేర్లతో దాచుకుంటుంటారు.

తాజాగా హైదరాబాద్ మున్సిపల్ డెవలప్ మెంట్ పట్టణ ప్రణాళిక విభాగం (HMDA) మాజీ డైరెక్టర్‌గా, రేరా కార్యదర్శిగా పని చేస్తున్న శివబాలకృష్ణ (HMDA former director Shiva Balakrishna) అక్రమ ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యాడు. శివబాలకృష్ణపై ఆదాయానికి మించిన ఆస్థుల కేసు నమోదు కావడంతో గురువారం తెల్లవారుజామున పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. తన పదవిని ఆసరగా చేసుకుని వందల కోట్లు అక్రమంగా సంపాదించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

We’re now on WhatsApp. Click to Join.

బాలకృష్ణ గతంలో HMDA ప్రాణళిక విభాగం డైరెక్టర్‌గా ఉంటూనే.. మరోవైపు ఎంఏయూడీ (పురపాలన, పట్టణాభివృద్ధి విభాగం)లో ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. హెచ్‌ఎంఏ నుంచి దస్త్రాలను ఆయనే పంపించేవారు. ఎంఏయూడీలో డైరెక్టర్ కూడా ఆయనే కాబట్టి వాటికి జీవోలిచ్చేవారు. ఈయన మేడ్చల్, మెదక్, రంగారెడ్డి, భువనగిరి, సంగారెడ్డి.. తదితర 7 జిల్లాలోని భూములకు సంబంధించిన అనుమతుల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. HMDA పరిధి జోన్లలో ఉన్న రూల్స్‌ను ఆసరగా చేసుకొని వందల దరఖాస్తులకు ఆమోదముద్ర వేసేందుకు భారీగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో అంతస్తుకు రూ.4 లక్షల వరకు.. అలాగే లేఅవుట్లలో ఒక్కో ఎకరానికి రూ.లక్షల్లో వసూళ్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. అంతేకాదు నెలకు 70 – 80 దస్త్రాలకు అనుమతులు మంజూరు చేస్తు డబ్బులు దండుకున్నారని బాలకృష్ణపై ఆరోపణలున్నాయి.

బుధవారం ఆయన నివాసాల్లో దాడులు చేసిన ఏసీబీ అధికారులకు దిమ్మదిరికే ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. వంద కోట్లకుపైగా ఆస్తులు వెలికి తీశారు. శివబాలకృష్ణ నివాశాల్లో సుమారు 14 బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఆయనకి ఉన్న ఇళ్లు, బంధువులు ఇళ్లల్లో కూడా సోదాలు జరిపారు. ప్రస్తుతం అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం రూ.500 కోట్ల వరకు అక్రమ ఆస్తులు సంపాదించినట్లు చెపుతున్నారు. ఇప్పటి వరకు రూ.40లక్షల నగదు, రెండు కిలోల బంగారం, 60 ఖరీదైన వాచ్ లు, 14 విలువైన మొబైల్‌ ఫోన్లు, 10 ల్యాప్‌టాప్‌లు గుర్తించారు. దీంతో పాటు స్థిర, చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి..బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయితే ఈరోజు (గురువారం) ఆయన్ని కోర్టులో హాజరు పరిచే అవకాశాలు ఉన్నాయి.

Read Also : India vs England: టాస్ ఓడిన టీమిండియా.. బ్యాటింగ్ చేయ‌నున్న ఇంగ్లండ్‌..!