Extramarital Affair: యువకునితో మహిళ వివాహేతర సంబంధం.. స్థానికులు ఏం చేశారంటే?

స్థానికులు ఈ చర్యను సమాజంలో నీతి, సంప్రదాయాలను కాపాడేందుకు తీసుకున్న ఒక హెచ్చరికగా సమర్థించుకున్నప్పటికీ, బహిరంగంగా అవమానించడం, చట్టాన్ని సొంత చేతుల్లోకి తీసుకోవడం చట్టవిరుద్ధమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Extramarital Affair

Extramarital Affair

Extramarital Affair: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని అశోక్ నగర్‌లో వివాహేతర సంబంధం (Extramarital Affair) కార‌ణంగా ఓ మహిళ, యువకుడిని స్థానికులు తాడుతో కట్టి, యువకుడికి దేహ శుద్ధి చేసి బహిరంగంగా అవమానించిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటన స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. ఇందుకు సంబంధించి వీడియో సైతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

సమాచారం ప్రకారం.. పెద్ద‌ప‌ల్లి జిల్లాలోని అశోక్ నగర్‌లో నివాసముంటున్న మౌనిక అనే మహిళకు ఫేస్‌బుక్ ద్వారా భూపాలపల్లికి చెందిన స్వామి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధంగా మారినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. స్వామి గత మూడు రోజులుగా మౌనిక ఇంట్లో ఉంటున్నాడని గుర్తించిన స్థానికులు ఈ వ్యవహారాన్ని త‌ప్పుగా భావించారు. ఇద్దరినీ తాడుతో కట్టి యువకుడికి దేహ శుద్ధి పేరుతో బహిరంగంగా శిక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వీడియో కింద చూడ‌గ‌ల‌రు.

Also Read: Gill Breaks Silence: మా ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ మాత్ర‌మే ఉంది.. పాండ్యా తీరుపై స్పందించిన గిల్‌!

స్థానికులు ఈ చర్యను సమాజంలో నీతి, సంప్రదాయాలను కాపాడేందుకు తీసుకున్న ఒక హెచ్చరికగా సమర్థించుకున్నప్పటికీ, బహిరంగంగా అవమానించడం, చట్టాన్ని సొంత చేతుల్లోకి తీసుకోవడం చట్టవిరుద్ధమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన వ్యక్తిగత స్వేచ్ఛ, చట్టపరమైన హక్కులపై ప్రశ్నలను లేవనెత్తింది. సమాజంలో మారుతున్న సంబంధాల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల పాత్ర, వాటి ప్రభావం కూడా ఈ ఘటనతో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

ఈ ఘటన తర్వాత స్థానికులు మౌనిక, స్వామిని సుల్తానాబాద్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి, ఇద్దరి చర్యలతో పాటు స్థానికుల విచక్షణారహిత చర్యలపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. చట్టాన్ని సొంత చేతుల్లోకి తీసుకోవద్దని, ఫిర్యాదులను పోలీసులకు అప్పగించాలని అధికారులు స్థానికులకు సూచించారు.

 

  Last Updated: 31 May 2025, 07:48 PM IST