GHMC Kulaganana Survey: దేశ చరిత్రలోనే అపూర్వమైన రీతిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే (కులగణన) (GHMC Kulaganana Survey) తెలంగాణ సమాజపు సంక్లిష్టతకు, మౌలిక సమస్యలకు అద్దం పట్టనుంది. సర్వే ఇచ్చే వాస్తవిక అంచనాలు నూతన రాష్ట్ర ప్రభుత్వానికి దిశా నిర్దేశన చేయడమే కాకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో కీలకమైన సూక్ష్మస్థాయి ప్రణాళికా రచనకు దోహదపడేవిగా ఉండనున్నాయి. నూతన రాష్ట్రంలో ప్రజలు ప్రధానంగా భూమి, నీరు, నీడ, ఉపాధుల కోసం తపిస్తున్నారని ఇప్పటివరకు జరిగిన సర్వేలో నిగ్గు తేలింది. ఆ లక్ష్యాల సాధనకు అన్ని వర్గాలను కలుపుకొని సమష్టిగా కృషి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది.
ఈ కులగణను రేవంత్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరూ కులగణనకు సహకరించాలని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ప్రభుత్వ అధికారులు ప్రజలను కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారులు పటిష్టంగా చర్యలు చేపట్టారు.
Also Read: CM Revanth: మాగనూరు ఘటనపై సీఎం రేవంత్ ఆగ్రహం.. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు!
ఇకపోతే జీహెచ్ఎంసీ వ్యాప్తంగా సర్వే వియవంతంగా జరుగుతోంది. నగర ప్రజలు ఎన్యుమరేటర్లకు పూర్తి సహకారం అందించడం మూలంగా సర్వే నగర వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. నగరంలో చేపట్టే సర్వేలో సినీ ప్రముఖులు, ఉన్నతాధికారులు, పదవీ విరమణ పొందిన ఐఏఎస్, వివిధ పార్టీల నాయకుల వివరాలను సర్వే సిబ్బంది నమోదు చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి అవకాశాల మెరుగుకు రాజకీయ, కుల సర్వే ప్రకారం ప్రజలకు అవసరమైన పథకాలకు రూపకల్పన చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో సర్వేలో ప్రజలు ఎక్కువ శాతం పాల్గొంటున్నారు.
అందరి సమన్వయంతో సర్వే జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. తప్పులు లేకుండా సర్వేను సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఎన్యూమరేటర్లకు సూచనలు, సలహాలు ఇస్తూ ప్రభుత్వం నిర్దేశించిన మేరకు కోడింగ్ ప్రక్రియను సవర్ధవంత్తంగా పూర్తి చేయుటకు మానిటరింగ్, నోడల్,జోనల్ అధికారులు విశేష కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ వ్యాప్తంగా బుధవారం 1,32,656 కుటుంబాల సర్వే పూర్తి కాగా.. ఇప్పటివరకు 13,91,817 కుటుంబాల సర్వే పూర్తితో 57.30 శాతం సర్వే పూర్తి చేశారు.