Dusharla Satyanarayana : “ఇండియాస్ గ్రీన్‌హార్ట్ దుశర్ల సత్యనారాయణ” అనే డాక్యుమెంటరీ చిత్రం తడాఖా చూపించింది. చిల్కూరి సుశీల్‌రావు నిర్మించి దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీని దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 23న జరిగిన 4వ నదీ ఉత్సవ్‌లో ప్రదర్శించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సినీ నిర్మాతలు నదులు, పర్యావరణ పరిరక్షణపై రూపొందించిన సినిమాలు, డాక్యుమెంటరీలను ఇక్కడ ప్రదర్శించారు.
Also read : iPhone Screen Distance: స్మార్ట్‌ఫోన్ నుంచి మయోపియా ప్రమాదం.. ఐఫోన్ సరికొత్త టెక్నాలజీ
తెలంగాణలోని సూర్యాపేట సమీపంలో ఉన్న రాఘవపురంలో తన పూర్వీకుల భూమిలో 70 ఎకరాల్లో దుశర్ల అడవిని ఎలా పెంచాడు ? దాన్ని 60 ఏళ్లకు పైగా ఎలా సంరక్షిస్తున్నారు ? అనేదే “ఇండియాస్ గ్రీన్‌హార్ట్ దుశర్ల సత్యనారాయణ” (Dusharla Satyanarayana) డాక్యుమెంటరీలో స్టోరీ. ఈ ప్రోగ్రామ్ సందర్భంగా 69 ఏళ్ల దుశర్ల సత్యనారాయణను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) చైర్మన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ నదుల ప్రాముఖ్యత గురించి వివరించారు. నదీ ఉత్సవ్ ను కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ (IGNCA) సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు నిర్వహించింది.