Phone Tapping Case : ‘ఫోన్ ట్యాపింగ్‌’తో నాకు సంబంధం లేదు.. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు లేఖ

తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు క్రియేట్ చేస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌(Phone Tapping Case) వ్యవహారంతో ముడిపడిన మరో సరికొత్త అప్‌డేట్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published By: HashtagU Telugu Desk
Former Sib Chief Prabhakar Raos Letter

Phone Tapping Case : తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు క్రియేట్ చేస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌(Phone Tapping Case) వ్యవహారంతో ముడిపడిన మరో సరికొత్త అప్‌డేట్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న స్పెషల్ ఇంటెలీజెన్స్ బ్యూరో  (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు జూన్ 23న జూబ్లీహిల్స్‌ పోలీసులకు రాసిన లేఖ ఇప్పుడు బయటికి వచ్చింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుతో తనకు సంబంధం లేదని అందులో ఆయన స్పష్టం చేశారు. వాస్తవానికి తాను జూన్‌ 26వ తేదీనే భారత్‌కు తిరిగి రావాల్సిందని.. ఆరోగ్యం బాగోలేక చికిత్స నిమిత్తం అమెరికాలోనే ఉండిపోయానన్నారు. వైద్యుల సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రభాకర్‌రావు తెలిపారు. తాను క్యాన్సర్‌, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు లేఖలో ప్రస్తావించారు.

We’re now on WhatsApp. Click to Join

తనపై అసత్య ఆరోపణలు చేస్తూ మీడియాకు లీకులు ఇస్తున్నారని ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు(Former SIB chief) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అసత్య ఆరోపణల వల్ల తాను, తన కుటుంబం మానసికంగా కుమిలిపోతున్నట్లు లేఖలో ఆయన చెప్పుకొచ్చారు. చట్టపరంగా విచారణ జరిగితే.. తాను తప్పకుండా సహకరిస్తానని స్పష్టం చేశారు. టెలీ కాన్ఫరెన్స్‌లో, మెయిల్‌ ద్వారా సమాచారం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. తాను క్రమశిక్షణ కలిగిన పోలీసు అధికారినని.. ఎక్కడికీ తప్పించుకుని పారిపోయే పరిస్థితే లేదన్నారు. పూర్తిగా కోలుకున్నాక విచారణకు హాజరవుతానని ప్రభాకర్ రావు తెలిపారు. గతంలో కూడా పలుమార్లు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు వాట్సాప్ కాల్ ద్వారా వివరించానని చెప్పారు.

Also Read :Raja Yoga : ఆ మూడు రాశులవారికి త్వరలో లక్ష్మీనారాయణ యోగం

ఫోన్​ట్యాపింగ్ ​వ్యవహారంలో జడ్జీలు, వాళ్ల కుటుంబ సభ్యుల పేర్లు మీడియాలో ప్రసారం చేయొద్దని హైకోర్టు ధర్మాసనం బుధవారం రోజు ఆదేశించింది. కొన్ని పత్రికల్లో జడ్జి పేరు, మొబైల్​నంబర్ ​ప్రచురించిన విషయాన్ని హైకోర్టు ఈసందర్భంగా గుర్తు చేసింది. ఫోన్​ట్యాపింగ్‌​పై మీడియా సంయమనం పాటించాలని, బాధ్యతతో వ్యవహరించాలని హితవు పలికింది. ఫోన్​ట్యాపింగ్​కేసు వార్తలు రాసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని మీడియాను కోరింది.

Also Read :UK MP Shivani Raja: వీడియో.. భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన శివానీ రాజా

  Last Updated: 11 Jul 2024, 09:48 AM IST