పాలనా వ్యవస్థలో కీలక మార్పులు చేపడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాలనలో ప్రక్షాళన చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) పదవిలో మార్పులు చేశారు. ప్రస్తుత సీఎస్ శాంత కుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనుండగా, ఆమె స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి రామకృష్ణారావును నూతన సీఎస్‌గా నియమించారు. శాంత కుమారి పదవీ విరమణ అనంతరం ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తుంది.
Inorbit : “ది గ్రీన్ ఫ్లీ ” ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్
రామకృష్ణారావు 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కాగా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఆర్థిక శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన్ని సీఎస్ పదవికి ఎంపిక చేయడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ పరిపాలనా పనితీరును మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు. మరోవైపు శాంత కుమారి కేసీఆర్ హయాంలో సీఎస్ గా కొనసాగినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఒక ఏడాది పాటు సేవలందించారు. తాజా పరిణామాలతో శాంత కుమారి అధికారిక పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రభుత్వానికి సలహాదారుగా కొనసాగనున్నారు.
Fact Check : భారత సైన్యం ఆధునికీకరణకు విరాళాలు.. నిజమేనా ?
సామాజిక పరిపాలన మరియు పాలనా రంగంలో శాంత కుమారి అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని, ఆమెను ఎంసీహెచ్ఆర్డీ (MCHRD) వైస్ ఛైర్మన్ పదవికి నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు సిద్ధం కాగా, పదవీ విరమణ తరువాత తక్షణమే ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. తొలుత శాంత కుమారికి సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ పదవి ఇవ్వాలని భావించినప్పటికీ, ఇప్పుడు ఎంసీహెచ్ఆర్డీ కీలక పదవిని ఆమెకు కేటాయిస్తున్నారు.