Iconic Bridge : తెలంగాణ సరిహద్దుల్లో కృష్ణా నదిపై నాలుగు లేన్లతో ఒక ఐకానిక్ వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఈ వంతెన ఎత్తు దాదాపు 173 మీటర్లు ఉంటుందట. హైదరాబాద్-శ్రీశైలం నాలుగు లేన్ల జాతీయ రహదారి కారిడార్ ప్రాజెక్టులో భాగంగా భారీ ఖర్చుతో దీన్ని నిర్మించాలని యోచిస్తున్నారు. తెలంగాణ నుంచి శ్రీశైలం వైపునకు వెళ్లే రోడ్డుమార్గం అందరికీ తెలుసు. ఈ రూటులో ఈగలపెంట మీదుగా పాతాళ గంగ దాటిన తర్వాత కృష్ణా నదిపై ఇప్పటికే ఒక వంతెన ఉంది. ఆ వంతెనను దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిధి మొదలవుతుంది. తెలంగాణ సరిహద్దుల్లో ఉండే ఈ ఏరియాలో కృష్ణా నదికి ఇరువైపులా ఎత్తైన కొండలపై నుంచి కింది వరకు అనేక మలుపులతో ఘాట్ రోడ్డు ఉంది. కృష్ణా నదిని దాటేసి ఏపీలోకి ఎంటర్ అయ్యాక.. మళ్లీ ఘాట్ రోడ్డు మలుపులు తిరుగుతూ కొండ వద్దకు చేరుతుంది.
Also Read :Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్‌లో బీజేపీ దూకుడు.. లీడ్‌లో ప్రియాంక.. అజిత్ పవార్ వెనుకంజ
ఈ రూటులో దూరం ఎక్కువగా ఉండటంతో జర్నీకి ఎక్కువ టైం పడుతోంది. దూరం, టైం రెండింటినీ తగ్గించే లక్ష్యంతోనే ఈ ఏరియాలోని కృష్ణా నదిపై భారీ వంతెన నిర్మాణానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు ప్రపోజ్ చేశారు. కృష్ణా నదిపై ఉన్న ప్రస్తుత రోడ్డుకు, శ్రీశైలం డ్యాంకు మధ్యలో వంతెన ఎలైన్‌మెంట్‌ను ప్రతిపాదించారు. శ్రీశైలం డ్యాం దిగువన నదిని దాటే చోట నాలుగు లేన్లలో ఐకానిక్ బ్రిడ్జి(Iconic Bridge) నిర్మాణానికి డిజైన్‌ను రెడీ చేశారు. ఈ డిజైన్‌కు కేంద్ర అటవీ శాఖ, రవాణా శాఖల అనుమతులు మంజూరైతే తెలంగాణ మీదుగా శ్రీశైలానికి తొమ్మిది కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గిపోతుంది.
Also Read :Beauty Tips: మీ టాన్ తొలగించుకోవాలంటే.. గంజి నీటిని ఇలా వాడండి..!
హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణ ప్రాజెక్టు మొత్తం పొడవు 62.5 కి.మీ ఉండగా.. దీనిలో 56.2 కి.మీ మార్గంలో అడవులే ఉన్నాయి. కేవలం 6.3 కి.మీ మార్గంలో జనావాసాలు, వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ హైవే విస్తరణలో భాగంగా దాదాపు 47.82 కి.మీ పొడవునా ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించబోతున్నారు. అంటే పొడవాటి ఫ్లై ఓవర్‌ను అందుబాటులోకి తెస్తారు.